Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jr Ntr Interesting tweets On Bunny ALA Movie.. Fans waiting

‘అల’ సూపర్: బన్నీ-బుడ్డోడి కోసం వెయిటింగ్!

Jr Ntr Interesting tweets On Bunny ALA Movie.. Fans waiting

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. శనివారం నాడు (జనవరి-12) విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా చూసిన వీరాభిమానులు, సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా బన్నీతో మంచి సన్నిహిత సంబంధాలున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అయితే.. జూనియర్ ట్వీట్‌కు బన్నీ రియాక్ట్ అయ్యాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణేంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

జూనియర్: ‘అల్లు అర్జున్ నటన అద్భుతం. త్రివిక్రమ్ గారు అద్భుతంగా సినిమాను రాసుకున్నారు. అల వైకుంఠపురములో సినిమా చాలా బావుంది. కంగ్రాట్స్ బావా.. స్వామి. మురళీ శర్మ గారి ఫెర్ఫామెన్స్ చాలా బాగుంది. థమన్ అందించిన సంగీతం సినిమాకు ఓ పెద్ద ప్లస్ పాయింట్. హారిక అండ్ హాసిని నిర్మాణ విలువలు బావుతున్నాయి. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’ అంటూ ఎన్టీఆర్ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

బన్నీ రిప్లై: ‘బావా థ్యాంక్యు వెరీ మచ్. మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది.. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను’ అని రిప్లయ్ ఇచ్చాడు బన్నీ. 

కాగా.. బన్నీ ఒక్కడే కాదు ఇండస్ట్రీలో అందరితోనూ జూనియర్ చాలా కలివిడిగా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఏ సినిమా అయినా సరే తాను చూస్తే కచ్చితంగా అందుకు సంబంధించి ట్వీట్స్ చేయడం.. వారిని మెచ్చుకోవడం బుడ్డోడికి కొత్తేమీ కాదు. వీరిద్దరి సంభాషణతో నందమూరి వీరాభిమానులు, మెగాభిమానులు మరీ ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఆనందలో మునిగితేలుతూ ఈ ట్వీట్స్‌ను లైక్ చేస్తూ పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు. మరి ఈ ఇద్దరి కలయిక ఎప్పుడు ఉంటుందా అని ఇరువురి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మరి కలయిక ఎప్పుడో ఏంటో..!

Jr Ntr Interesting tweets On Bunny ALA Movie.. Fans waiting

jr ntr
interesting tweets
bunny
ala vaikunthapurramuloo
nandamuri fans
bunny fans