‘హ్యాండ్స‌ప్‌..’ అంటూ వచ్చిన ‘అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌’

Fri 13th Dec 2019 04:57 PM
athade srimannarayana,rakshitshetty,handsup full video song  ‘హ్యాండ్స‌ప్‌..’ అంటూ వచ్చిన ‘అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌’
Athade SrimanNarayana Movie Song Released ‘హ్యాండ్స‌ప్‌..’ అంటూ వచ్చిన ‘అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌’
Sponsored links

ర‌క్షిత్ శెట్టి హీరోగా పుష్క‌ర్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ నిర్మిస్తోన్న చిత్రం ‘అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌’. స‌చిన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబంధించి భారీ లెవ‌ల్లో ప్ర‌మోష‌న్స్‌ను ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ‘హ్యాండ్స‌ప్‌...’ అనే తొలి వీడియో సాంగ్‌ను గురువారం విడుద‌ల చేశారు. 

సాహోరే స‌భా ప్రాంగ‌ణం.. వినుకో నా వీర ప్ర‌కర‌ణం

ఖాకీపై ప్ర‌మాణం.. నా ప్ర‌యాణం.. క‌త్తి అంచేగా ఒక్కో క్ష‌ణం

క‌ర్త‌వ్యం ధ‌ర్మ ర‌క్షణం.. పిస్తోలే హ‌స్త భూష‌ణం...

హ్యండ్స‌ప్ నా ప్ర‌తి శ‌బ్దం.. హ్యాండ్స‌ప్ నా నిశ్శ‌బ్దం.. హ్యండ్స‌ప్ ఓ అణుయుద్ధం

అనే ప‌ల్ల‌వితో మొద‌లైన పాట ఇది. పోలీస్ ఆఫీస‌ర్ అయిన హీరో విల‌న్స్‌కు త‌న క్యారెక్ట‌ర్ ఏంటి? త‌న ప‌నేంటి? అనే విష‌యాల‌ను వివ‌రిస్తుంది. పురాణాల్లో విష్ణుమూర్తిలాంటివాడ‌నని.. దుష్ట శిక్ష‌ణ శిష్ట ర‌క్ష‌ణ చేస్తాన‌ని ఈ పాట‌లో ఉంది. అదే హీరో పేరు. దాన్నే టైటిల్‌గా పెట్టారు. ఆస‌క్తిక‌రంగా.. అర్థ‌వంతంగా.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఈ పాట‌ను రాశారు. బి.అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమాలో టైటిల్ సాంగ్‌ను రామ‌జోగయ్య శాస్త్రి రాశారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ లెవ‌ల్లోఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

Click Here for Song

Sponsored links

Athade SrimanNarayana Movie Song Released:

HandsUp full video song from Rakshitshetty’s Athade SrimanNarayana released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019