‘అల’పై.. ఇలా వార్తలొస్తున్నాయేంటి?

Gossips on Ala Vaikunthapurramloo Digital Rights

Mon 09th Dec 2019 07:39 AM
allu arjun,ala vaikunthapurramloo,digital,rights  ‘అల’పై.. ఇలా వార్తలొస్తున్నాయేంటి?
Gossips on Ala Vaikunthapurramloo Digital Rights ‘అల’పై.. ఇలా వార్తలొస్తున్నాయేంటి?
Advertisement

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబో అల వైకుంఠపురములో సినిమా నిన్నమొన్నటివరకు సాంగ్స్ తో అల్లాడించింది. అయితే ఇప్పుడు టీజర్ విషయంలో అల టీం ఎక్కడా తొందర పడడం లేదు. సరిలేరు టీజర్ బ్లాక్ బస్టర్ అయినా.. సరిలేరు నీకెవ్వరు మొదటి సాంగ్ మైండ్ బ్లాంక్ సాంగ్ అంతగా లేకపోవడంతో.. అల వైకుంఠపురములో టీం టీజర్ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అల సినిమా బిజినెస్ ఊపందుకుంది. తాజాగా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయానని ప్రచారం జరిగింది. శాటిలైట్ హక్కులను జెమిని టివి, డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

అయితే అల వైకుంఠపురములో శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కులను రెండు కలిపి జెమిని టీవీకే అంటే సన్ నెట్ వర్క్ కి అమ్మేసిన నిర్మాతలు ఇప్పుడు తాజాగా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కి ఎలా అమ్మారు అంటున్నారు. జెమిని ఛానల్ కి సన్ డైరెక్ట్ అనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఉంది. మరి ఇప్పుడు తాజాగా నెట్ ఫ్లిక్స్ పేరు ఎలా బయటికొచ్చిందో ఎవరికి అర్ధం కావడం లేదంటున్నారు. అయితే ఇలా కావాలనే అల వైకుంఠపురములో మీద హైప్ పెంచడానికి ప్లాన్ చేసి లీకులు వదులుతున్నారని, లేదంటే అందులో మరేదో మర్మం దాగుందేమోలే అంటున్నారు.

Gossips on Ala Vaikunthapurramloo Digital Rights:

Fake Publicity to Ala Vaikunthapurramloo


Loading..
Loading..
Loading..
advertisement