చిరు మాటకు కొరటాల నొచ్చుకున్నాడా?.. ఏమైంది!

Tue 03rd Dec 2019 07:21 PM
megastar chiranjeevi,koratala shiva,chiru-koratala movie,latest update  చిరు మాటకు కొరటాల నొచ్చుకున్నాడా?.. ఏమైంది!
Megastar Chiranjeevi-Koratala Shiva Movie Latest Update! చిరు మాటకు కొరటాల నొచ్చుకున్నాడా?.. ఏమైంది!
Sponsored links

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో.. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఒకట్రెండు కాదు చాలా లాంగ్ గ్యాప్ తర్వాతే కొరటాల అనుకున్నట్లుగా చిరుతో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు కొబ్బరికాయ కొట్టేయగా షూటింగ్ మాత్రం అస్సలు ఇంచు కూడా ముందుకెళ్లలేదు. అసలు షూటింగ్ ఎందుకు మొదలుకాలేదు..? చిరు-కొరటాల మధ్య క్లాష్ వచ్చిందా..? చిరు అన్న మాటకు కొరటాల కాసింత అసహనానికి గురయ్యాడా..? అని ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయ్. ఇంతకీ అసలేం జరిగింది..? ఆ పుకార్ల సారాంశమేంటనేది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

చిరు-కొరటాల కాంబోలో సినిమా షూటింగ్ మాత్రం గ్రాండ్‌గానే ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకూ రెగ్యులర్‌గా షూటింగ్‌ మాత్రం అస్సలు జరగలేదు. ఇప్పటికే సినిమాలో ఎవరెవర్ని తీసుకోవాలి..? ఎవరి పాత్రలేంటి..? హీరోయిన్‌గా ఎవర్ని తీసుకోవాలి..? ఇలా అన్ని లెక్కలూ శివ కానిచ్చేసినప్పటికీ.. చిరు మాత్రం చాలా ఆలస్యం చేస్తున్నారట. సార్ షూటింగ్ షురూ చేద్దామని చిరును కొరటాల అడిగినప్పటికీ.. ‘కూల్ శివా అంత కంగారొద్దు.. స్లోగానే సినిమా చేద్దాం.. పనులున్నాయ్ అవ్వగానే స్టార్ట్ చేద్దాం’ అని చిరు అన్నారట. చిరు అన్న ఈ మాటతో అసలేం జవాబు ఇవ్వాలో తెలియక.. ఎదురు మాట్లాడాలేక.. కక్కలేక మింగలేక.. నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి చిరులో రాజకీయాలకు దాదాపు గుడ్ బై చెప్పేసి సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా వరకు మునుపటి చురుకుదనం కనిపించట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ‘సైరా’లాంటి పెద్ద సినిమా చేసిన తర్వాత చిరు బాగా రెస్ట్ తీసుకుంటున్నట్లు టాక్. అంతేకాదు.. కొరటాల శివతో చేయాలి.. చేయాలి అనే ఇంట్రెస్ట్ ‘సైరా’ రిలీజ్‌కు ఎలా ఉన్నదో.. అది ఇప్పుడు లేదట. అయితే సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా..? అప్డేట్స్ ఎప్పుడొస్తాయా..? అని మెగాభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అసలు ఎప్పుడు షూట్ స్టార్ట్ అవుద్దో..? ఏంటో..!?. పైన చెప్పిన కారణాల వల్లే సినిమా షూటింగ్ ఇంకా షురూ కాలేదని సమాచారం. ఇందులో నిజమెంతో..? అబద్ధమెంతో తెలియాలంటే కొరటాల పెదవి విప్పితేగానీ తెలిసే పరిస్థితి లేదు.

Sponsored links

Megastar Chiranjeevi-Koratala Shiva Movie Latest Update!:

Megastar Chiranjeevi-Koratala Shiva Movie Latest Update!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019