Advertisementt

డిసెంబర్ బరిలో రాజ్‌తరుణ్ సినిమా!

Sat 30th Nov 2019 05:52 PM
raj tarun,iddari lokam okate,movie,censor,completed  డిసెంబర్ బరిలో రాజ్‌తరుణ్ సినిమా!
RajTarun Movie in December Race డిసెంబర్ బరిలో రాజ్‌తరుణ్ సినిమా!
Advertisement
Ads by CJ

‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’ సెన్సార్ పూర్తి.. డిసెంబ‌ర్ 2019 విడుద‌ల‌

యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం ‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’. జీఆర్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ స‌ర్టిఫికేట్‌ను పొందింది. డిసెంబ‌ర్లో  సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ - ‘‘మా బ్యాన‌ర్‌లో రాజ్‌తరుణ్ హీరోగా న‌టిస్తోన్న రెండో చిత్ర‌మిది. క్యూట్ ల‌వ్ స్టోరీ. యూత్‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమాను డైరెక్ట‌ర్ కృష్ణ తెర‌కెక్కించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన రెండు పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌లు, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా సెన్సార్ పూర్తయ్యింది. ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్నాము’’ అన్నారు.

న‌టీన‌టులు:

రాజ్ త‌రుణ్‌, షాలిని పాండే, నాజ‌ర్‌, పృథ్వీ, రోహిణి, భ‌ర‌త్‌, సిజ్జు, అంబ‌రీష్‌, క‌ల్పల‌త త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  జీఆర్‌.కృష్ణ‌

స‌మ‌ర్ప‌ణ‌:  దిల్‌రాజు

నిర్మాత‌:  శిరీష్‌

కెమెరా:  స‌మీర్ రెడ్డి

మ్యూజిక్‌:  మిక్కీ జె.మేయ‌ర్‌

ఎడిటింగ్‌:  తమ్మి రాజు

డైలాగ్స్‌:  అబ్బూరి ర‌వి

RajTarun Movie in December Race:

Iddari Lokam Okate Movie Censor Completed

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ