నయనతారపై యాక్షన్ స్టార్ట్ చేశారు

Kollywood Directors and Producer Takes action on Nayanthara

Mon 18th Nov 2019 11:31 AM
nayanthara,action,directors,producers,kollywood,tollywood,heroine  నయనతారపై యాక్షన్ స్టార్ట్ చేశారు
Kollywood Directors and Producer Takes action on Nayanthara నయనతారపై యాక్షన్ స్టార్ట్ చేశారు
Advertisement

నయనతార కోలీవుడ్ టాప్ హీరోయిన్. ఎవరూ కాదనలేని సత్యం అది. స్టార్ హీరోలకే కాదు, కుర్ర హీరోలకు నయనతార క్రేజీ హీరోయిన్. అందుకే ఆమెకి అడిగినంత పారితోషకం ఇస్తున్నారు. ఎంత పారితోషకం ఇచ్చినా ఏం లాభం. తన క్రేజ్‌తో సినిమాలలో నటిస్తుంది కానీ ప్రమోషన్స్‌కి రాదు. దర్శకనిర్మాతలకు ఎంతగా కడుపుమంట ఉన్నప్పటికీ... నయనతార క్రేజ్ వలన అంత దిగమింగుకుంటున్నారు. అయితే తాజాగా ఆమెకి క్రేజ్ ఉంటే ఉంది.. ఇకనుండి టాలీవుడ్ దర్శకనిర్మాతలు నయనతార విషయంలో కాస్త క్లారిటీకి వచ్చారు. ఎవరు లేకపోతే నయనతార అనే సూత్రం పాటిస్తున్నారు. అంటే ఏ హీరోయిన్ అందుబాటులో లేకపోతే నయనతారని ఆప్షన్‌గా పెట్టుకున్నారు.

ప్రస్తుతం కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో నటిస్తున్న నయనతారకి కోలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా షాకిచ్చేలా కనబడుతుంది వ్యవహారం. అదే ఆమె పబ్లిసిటీకి దూరంగా ఉంటే.. ఆమెకి అవకాశాలు దూరం అంటూ ఓ మాట మీద కొచ్చేలా కోలీవుడ్ దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా టాక్. నయనతార తాను పెట్టే కండిషన్, పబ్లిసిటీ విషయంలో తీరు మార్చుకోకపోతే  తామే తమ తీరు మార్చుకుంటామని నయనతారకి తెలిసేలా చేసేట్టుగా కనబడుతున్నారు. ఇక నుంచి ఆమె స్థానంలో మరో పేరున్న హీరోయిన్‌ని తీసుకుని ఆమెకి షాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

Kollywood Directors and Producer Takes action on Nayanthara:

Producers and Directors gives shock to Nayanthara


Loading..
Loading..
Loading..
advertisement