చిరుతో ఆ మూవీ చేయనన్న డైరెక్టర్..!

Sat 09th Nov 2019 08:27 PM
sukumar,chiranjeevi,reject,lucifer remake,sukku,ram charan  చిరుతో ఆ మూవీ చేయనన్న డైరెక్టర్..!
Director Rejects Megastar’s Film? చిరుతో ఆ మూవీ చేయనన్న డైరెక్టర్..!
Sponsored links

మెగాస్టార్ చిరుతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటాడు. ఇప్పటికే పూరి జగన్నాధ్, సుకుమార్ లాంటి దర్శకులు చిరంజీవితో సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్న చిరంజీవి మలయాళ సూపర్ హిట్ ఫిలిం లూసిఫర్‌లో కూడా చేయనున్నాడనే టాక్ మొన్నటి వరకు వినబడింది. అయితే లూసిఫర్ రీమేక్‌ని రామ్ చరణ్, సుకుమార్ కి అప్పగించాలని ప్లాన్ చేసాడు. సుకుమార్ కూడా ముందు చిరుతో లూసిఫర్ రీమేక్ పై సానుకూలంగానే స్పందించాడు. అయితే అల్లు అర్జున్ తో సుకుమార్ తాజాగా ఓ మూవీని పట్టాలెక్కించాడు. సుకుమార్, అల్లు అర్జున్ సినిమాని, చిరు, కొరటాల సినిమాని పూర్తి చేసాక సుకుమార్ తో చిరు లూసిఫర్ రీమేక్ ఉండబోతుందని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

అయితే తాజా సమాచారం ప్రకారం సుకుమార్ లూసిఫర్ రీమేక్ చెయ్యనని రామ్ చరణ్ కి చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మెగా ఆఫర్‌ని సుకుమార్ సున్నితంగా తిరస్కరించాడని, ఈలెక్కల మాస్టర్ లెక్కల ప్రకారం రీమేక్ సినిమాలు చెయ్యకూడదని అనుకోవడం వలనే లూసిఫర్ రీమేక్ ని వదిలేసినట్టుగా ఫిలింనగర్ టాక్. ఇక చరణ్ దగ్గర లూసిఫర్ రైట్స్ ఉండడంతో.. ఇప్పుడు ఆ రీమేక్ కోసం మరో డైరెక్టర్ వేటలో అతను ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Sponsored links

Director Rejects Megastar’s Film?:

Sukumar’s No to Megastar’s Film?

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019