పారిస్‌లో ‘సామజవరగమన’ అంటోన్న బన్నీ, పూజా!

Sat 09th Nov 2019 12:27 PM
ala vaikunthapurramuloo,allu arjun,pooja hegde,samajavaragamana,paris  పారిస్‌లో ‘సామజవరగమన’ అంటోన్న బన్నీ, పూజా!
Samajavaragamana being shot in picturesque locales in Paris పారిస్‌లో ‘సామజవరగమన’ అంటోన్న బన్నీ, పూజా!
Sponsored links

 

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, పూజ హెగ్డేలపై అందమైన గీతం

పారిస్‌లోని పలు సుందరమైన ప్రదేశాలలో ‘సామజవరగమన’ చిత్రీకరణ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ప్రసిద్ధ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘సామజవరగమన’ పాట తెలుగునాట ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఇప్పటికీ అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. సామాజిక మాధ్యమాలలో కొంగొత్త రికార్డులను సృష్టిస్తూ మోస్ట్ వాచ్డ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియాగా నిలిచింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం, ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆడియో పరంగా ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ సాంగ్ ను ప్రస్తుతం పారిస్‌లోని పలు అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, పూజ హెగ్డేలపై చిత్రీకరిస్తున్న ఈ అందమైన గీతానికి ,శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘అల వైకుంఠపురం’లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అల వైకుంఠపురములోని తారలు:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

 

సాంకేతిక నిపుణులు:

డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,

ఫైట్స్: రామ్ – లక్ష్మణ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్

నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Sponsored links

Samajavaragamana being shot in picturesque locales in Paris:

Ala Vaikunthapurramuloo Movie Latest Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019