ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pelli Choopulu Actress Ritu Varma Comes Tollywood!

‘పెళ్లి చూపులు’ పాప మళ్లీ వచ్చేస్తోంది!

రీతూవర్మ.. ‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా హిట్టయినప్పటికీ ఈ భామకు మాత్రం ఆశించినంత గుర్తింపు రాలేదు.. సినిమా అవకాశాలు ఆశించినంతగా రాలేదు. తెలుగమ్మాయి అయినప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు కానీ.. ఎక్కడెక్కడ్నుంచో వచ్చిన భామలకు మాత్రం గట్టిగానే వస్తున్నాయ్. ‘పెళ్లి చూపులు’ తర్వాత ‘కేశవ’ సినిమాలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. తెలుగులో అవకాశాలు వస్తాయని వేయి కళ్లతో ఎదురుచూసినా రాకపోయే సరికి తమిళ్, మలయాళం వైపు రీతూ అడుగులేసింది. అక్కడ అరకొర సినిమాలతో సరిపెట్టుకుంటోంది. అయితే తాజాగా తెలుగమ్మాయికు సంబంధించిన ఓ న్యూస్ బాగా హల్ చల్ చేస్తోంది.

ఇప్పటికే.. మలయాళంలో కుర్రహీరో దుల్కర్ సల్మాన్ జోడీగా రీతూ ఓ సినిమా చేస్తోంది. అయితే ఈ తెలుగమ్మాయికి టాలీవుడ్‌లో నటించాలంటూ పిలుపువెళ్లిందట. నాగశౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూవర్మను దర్శకనిర్మాతలు ఫిక్స్ చేశారట. ఇప్పటికే ఈ విషయాన్ని రీతూకు ఫోన్ ద్వారా సమాచారం అందించారట. సో.. మొత్తానికి చూస్తే తెలుగమ్మాయి మళ్లీ తెలుగు సినిమాల్లో నటిస్తోందన్న మాట. సినీ కెరీర్‌లో అవకాశాల్లేక సతమతమవుతున్న రీతూకు ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో..? అసలు ఈ వార్తలో ఏ మేరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Pelli Choopulu Actress Ritu Varma Comes Tollywood!

Pelli Choopulu Actress Ritu Varma Comes Tollywood!
pelli choopulu
tollywood
actress ritu varma
naga shourya