శ్రీవిష్ణు హీరోగా కొత్త చిత్రానికి క్లాప్ కొట్టారు

Tue 08th Oct 2019 11:33 PM
hero,sree vishnu,lakshya,productions no 3,new film,launched  శ్రీవిష్ణు హీరోగా కొత్త చిత్రానికి క్లాప్ కొట్టారు
Hero Sree Vishnu New Film Launched శ్రీవిష్ణు హీరోగా కొత్త చిత్రానికి క్లాప్ కొట్టారు
Sponsored links

శ్రీవిష్ణు హీరోగా ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్య‌ ప్రొడ‌క్ష‌న్ నెం.3 చిత్రం

డిఫ‌రెంట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న యువ క‌థానాయ‌కుల్లో శ్రీవిష్ణు ఒక‌రు. ఈ ఏడాది ‘బ్రోచేవారెవ‌రురా’తో సూప‌ర్‌హిట్ సాధించారు. వైవిధ్య‌మైన క‌థ‌, క‌థాంశాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే శ్రీవిష్ణు న‌టించ‌బోయే కొత్త చిత్రాన్ని విజ‌య‌ద‌శ‌మి రోజున ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. డిఫ‌రెంట్ పోలీస్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు పోలీస్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. న‌వంబ‌ర్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.  శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌దీప్ వ‌ర్మ‌

నిర్మాత‌: ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు)

బ్యాన‌ర్‌: ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌

మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌

సినిమాటోగ్ర‌ఫీ:  శేఖ‌ర్ వి.జోసెఫ్‌

ఆర్ట్‌:  వివేక్‌

Sponsored links

Hero Sree Vishnu New Film Launched:

Lakshya Productions No 3 Announcement

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019