Advertisement

బిగ్‌బాస్: శ్రీముఖి గేమ్ స్టార్ట్ చేసింది

Tue 24th Sep 2019 06:47 PM
sreemukhi,varun sandesh,himaja,bigg boss,game,rahul,fake elimination  బిగ్‌బాస్: శ్రీముఖి గేమ్ స్టార్ట్ చేసింది
Sreemukhi Game Starts in Bigg Boss బిగ్‌బాస్: శ్రీముఖి గేమ్ స్టార్ట్ చేసింది
Advertisement

మొదట 50 రోజులు ఎలా ఉన్నా కానీ 50 కంప్లీట్ అయిన దగ్గరనుండి బిగ్ బాస్ సీజన్ 3 ఇంట్రెస్టింగ్‌గా జరుగుతుంది. గత వారం నామినేషన్‌లో రాహుల్, మహేష్, హిమజ ఉంటే అందులో రాహుల్ ని ఫేక్ ఎలిమినేషన్ చేసి హిమజను ఎలిమినేట్ చేసాడు బిగ్ బాస్. రాహుల్ ఎలిమినేట్ అయ్యాడు అని షాక్‌లో ఉన్న ఇంటి సభ్యులకి ఒక్కసారి రాహుల్ రీఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చాడు.

మొన్నటివరకు రాహుల్ ని టార్గెట్ చేసిన శ్రీముఖి ఫేక్ ఎలిమినేషన్‌తో అతనికి ఫాలోయింగ్ ఉందేమో అని అర్ధం చేసుకుని బాబా భాస్కర్ అండ్ వరుణ్ సందేశ్ లను టార్గెట్ చేస్తుంది. ఈ నేపధ్యంలో నిన్న జరిగిన నామినేషన్ ప్రాసెస్ లో వరుణ్ అండ్ రాహుల్ ఉంటే శ్రీముఖి వరుణ్ ని టార్గెట్ చేస్తూ రాహుల్ ని సేవ్ చేసింది. అలానే ఫిమేల్ కంటెస్టెంట్ అయినా శివ జ్యోతి ని టార్గెట్ చేసింది శ్రీముఖి. రోజులు దగ్గర పడేకొద్దీ ఇంట్లో ఉన్న సభ్యులు తమ తెలివితేటలు ఉపయోగించి గేమ్ ఆడుతున్నారు. ఇక రానురాను ఈ సీజన్ మరింత హీట్ గా మారనుందని అర్ధం అవుతుంది.

Sreemukhi Game Starts in Bigg Boss:

Bigg Boss Telugu Latest Update

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement