Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Manchu Lakshmi about Feet Up with The Stars Telugu

‘ఫీట్ అప్ విత్ ద స్టార్’ గురించి మంచు లక్ష్మి

‘ఫీట్ అప్ విత్ ద స్టార్’ మీ ఫేవరేట్ స్టార్స్‌ని మరింత దగ్గర చేస్తుంది: మంచు లక్ష్మి

డిజిటల్ మీడియా రివల్యూషన్ చాలా వినోదాలను అందుబాటులోకి తెస్తుంది. ఎంటర్‌టైన్మెంట్ పరిధులు పెంచుతూ, సరికొత్త వినోదాలను పరిచయం చేస్తుంది. అలాంటి వూట్ అప్  ప్రెజెంట్స్ ‘ఫీట్ అప్ విత్ ద స్టార్’ మంచు లక్ష్మీ హోస్ట్‌గా రాబోతున్న ఈ ఎంటర్‌టైన్మెంట్ షో అనుభవాలు మీడియాతో పంచుకుంది.

ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన షోస్‌లో ఈ ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’ భిన్నమైనది. ఈ షో కోసం స్టార్స్‌ని కలిసినప్పుడు నైట్ డ్రెస్‌లో రమ్మంటే వారిలో కొందరు ఆశ్చర్యపోయారు. కొందరు ఉత్సాహం చూపించారు. బాలీవుడ్‌లో ఈ తరహా షోలు సాధారణమే. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. వాళ్ళ పర్సనల్ విషయాలు ఈ షో తో తెలుస్తాయి. ఇందులో కాంట్రవర్సీలకు తావులేదు. స్టార్స్ నా మీద పెట్టుకున్న భరోసాను చెదరనివ్వలేదు. ఈ షో కి వచ్చే స్టార్స్ చాలా ఇంటర్వ్యూలు చేశారు. టాక్ షోలు, ఈవెంట్స్‌లో మాట్లాడారు. వాళ్ల విషయాలు చాలా తెలుసు అనుకుంటాం. కానీ వారిలో ప్రతి రోజు ఎదో చేంజ్ వస్తుంది. వారి మాటలు, అనుభవాల్లో నుంచీ వస్తాయి. ఉదాహరణకు : సమంతా మనకు చాలా తెలుసు అనుకుంటాం.. కానీ నాగ చైతన్య గురించి ఈ షో లో మాట్లాడిన విషయాలు మీకు సర్ప్రైజ్ గా ఉంటాయి. వరుణ్ తేజ్ ఈ షోలో కొత్తగా కనబడతాడు. చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్. వచ్చిన వాళ్ళందరూ ఈ షో ని బాగా ఎంజాయ్ చేసారు. వాళ్ళ అభిమానులకు మరింత దగ్గర అవుతారు. ఈ షో కంప్లీట్ ఎంటర్‌టైన్మెంట్ వే లో వెళుతుంది. ఈ షో తప్పకుండా బిగ్ సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను. ఈ ఎపిసోడ్స్ ఈ నెల 23 నుండి వూట్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్ అందుబాటులోకి వస్తుంది’’ అన్నారు.

Manchu Lakshmi Latest Interview

Manchu Lakshmi about Feet Up with The Stars Telugu
manchu lakshmi
feet up with the stars telugu
stars
night secrets