ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> This is the HIghlight in Ala Vaikuntapuramlo Movie

‘అల వైకుంఠపురములో’ హైలైట్ ఇదేనంట!

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా గురించి ఇండస్ట్రీలో మంచి పాజిటివ్‌ బజ్‌ వినిపిస్తోంది. అలా వినిపించడానికి కారణం ఆ సినిమా యొక్క స్టోరీ. అల్లు అర్జున్ చిన్నప్పుడే తన ఇంటి నుండి వెళ్ళిపోయి మళ్లీ 25 ఏళ్ళు తరువాత తన ఇంటికి పనివాడిగా వచ్చి ఆ తండ్రి కష్టాలన్నీ తీర్చి, కొడుకుగా తన బాధ్యతలు నిర్వర్తించడం అనేది స్టోరీ.

వినడానికి చాలా సింపుల్ గా ఉన్నా త్రివిక్రమ్ మార్క్ కామెడీ, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ ఇందులో బాగానే ఉన్నాయని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం థమన్ చాలా మంచి పాటలు ఇచ్చాడు అని తెలుస్తుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

సినిమాకి థమన్ మ్యూజిక్ హైలైట్ అవుతుందని తెలుస్తుంది. దసరాకు టీజర్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’కి పోటీగా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.

Father and Son Sentiment in Ala Vaikuntapuramlo Movie

This is the HIghlight in Ala Vaikuntapuramlo Movie
ala vaikuntapuramlo movie
father and son sentiment
allu arjun
trivikram srinivas