కారు యాక్సిడెంట్ ట్విస్ట్: తరుణ్ కాదు..!!

Tue 20th Aug 2019 05:25 PM
tarun,raj tarun,accident,narsing,car accident,twitst,hero raj tarun  కారు యాక్సిడెంట్ ట్విస్ట్: తరుణ్ కాదు..!!
Twist in Hero Car Accident Case at Narsing కారు యాక్సిడెంట్ ట్విస్ట్: తరుణ్ కాదు..!!
Sponsored links

ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా నార్సింగ్ వద్ద హీరో తరుణ్ కారుకి యాక్సిడెంట్ అంటూ పలు వెబ్ సైట్స్ లో, పలు ఛానల్స్ లోను న్యూస్ రావడంతో నిజం గానే తరుణ్ కారుకి యాక్సిడెంట్ అయ్యిందనే అనుకున్నారు. వెంటనే తరుణ్ కి పరామర్శల వెల్లువ కొనసాగడంతో హీరో తరుణ్ తేరుకుని తన కారుకి ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదని ఆ కారు తనది కాదని... క్లారిటీ ఇచ్చాడు. అయితే తరుణ్ కారుకి యాక్సిడెంట్ కాకపోతే తరుణ్ పేరు బయటికి రావడం ఏమిటా అనుకునేలోపు... తరుణ్ ప్లేస్ లోకి హీరో రాజ్ తరుణ్ వచ్చాడు.

హీరో రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్ అంటూ కొత్త ట్విస్ట్ బయటికి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ అల్కపురి టౌన్ షిప్ దగ్గర హీరో రాజ్ తరుణ్ కారు డివైడర్ కి గుద్దుకున్నట్లుగా సీసీ టివి ఫుటేజ్ బయటికొచ్చింది. అయితే కారు ర్యాష్ డ్రైవింగ్ వలనే ఈ యాక్సిడెంట్ జరిగిందనే టాక్ వినబడుతుంది. అందుకే కారు యాక్సిడెంట్ కాగానే హీరో రాజ్ తరుణ్ కారు దిగి పారిపోతూ సీసీ టీవీ ఫుటేజ్ కి చిక్కాడు. అయితే కారు యాక్సిడెంట్ అయ్యాక రాజ్ తరుణ్ ఎందుకు కారు దిగి పారిపోయాడో అనేది ఇప్పుడు అందరికి అర్ధం కానీ ప్రశ్న. 

ఇక కారులో రాజ్ తరుణ్ తో పాటు ఓ నిర్మాత కూడా ఉన్నాడని అంటున్నారు. రాజ్ తరుణ్ కి ప్రమాదంలో గాయాలు కాలేదు కానీ.. పారిపోవడం మాత్రం అందరికి షాక్ కి గురి చేసింది. అయితే మద్యం మత్తులో మితిమీరిన వేగంతో యాక్సిడెంట్ చెయ్యడం వల్లనే రాజ్ తరుణ్ అలా కారు యాక్సిడెంట్ జరగగానే పారిపోయాడని చెబుతున్నారు. అయితే పోలీస్‌లు కారు రాజ్ తరుణ్‌దే అని గుర్తించి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

Sponsored links

Twist in Hero Car Accident Case at Narsing :

Not Tarun.. It’s Raj Tarun

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019