ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Director Puri Jagannadh and Vijay Deverakonda Film Announcement

అఫీషియల్: పూరీతో విజయ్ దేవరకొండ

Director Puri Jagannadh and Vijay Deverakonda Film AnnouncementDirector Puri Jagannadh and Vijay Deverakonda Film Announcement

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం కానుంది. రీసెంట్‌గా విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు పూరి జగన్నాథ్. ఈ చిత్రం ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.  

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్, సమర్పణ: లావణ్య, నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మి కౌర్, బ్యానర్స్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్.

Director Puri Jagannadh and Happening hero Vijay Deverakonda have joined hands for a new film

director
puri jagannadh
vijay deverakonda
new film
charmi