ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nani Gang Leader Teaser Release date Out

‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’ టీజర్‌ రిలీజ్‌ ఎప్పుడంటే?

జూలై 24న నేచురల్‌ స్టార్‌ నాని, విక్రమ్‌ కె.కుమార్‌, మైత్రి మూవీ మేకర్స్‌ ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’ టీజర్‌ రిలీజ్‌ 

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జూలై 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే ‘రారా.. జగతిని జయించుదాం...’ అంటూ సాగే ఈ సినిమా ఫస్ట్‌ సాంగ్‌కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన మ్యూజిక్‌ మెస్మరైజింగ్‌గా ఉంది. 

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రను ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

Nani Gang Leader Teaser release on July 24th

Nani Gang Leader Teaser Release date Out
nani
gang leader
teaser
release
july 24