నాని చాలా గట్టిగా ఫిక్సయ్యాడు..!

Sat 13th Jul 2019 01:09 AM
nani,gang leader,movie,release,date fixed  నాని చాలా గట్టిగా ఫిక్సయ్యాడు..!
Nani Gang Leader Movie Release Date నాని చాలా గట్టిగా ఫిక్సయ్యాడు..!
Sponsored links

విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో హీరో నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్ర షూటింగ్ సమయంలో నాని గాయపడడంతో షెడ్యూల్స్‌ అటు ఇటు అయ్యాయి. అందుకే ముందు అనుకున్న ఆగస్టు 30 న ఈసినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అంటున్నారు కొన్ని మీడియా వర్గాలు.

ఒకవేళ ఆగష్టులో రాకపోతే సెప్టెంబర్ లో వస్తుందని చెబుతున్నారు. కానీ సెప్టెంబర్ లో ఆల్రెడీ కొన్ని సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. మరి ఆ హడావిడిలో గ్యాంగ్ లీడర్ ను రిలీజ్ చేస్తారా? ఆగష్టు 30 న ఈసినిమా ఉందని చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్ ను షిఫ్ట్ చేసుకున్నాయి. సో సెప్టెంబర్ కి షిఫ్ట్ అవుతాడని ఆగస్టు 30న స్లాట్‌ దక్కించుకోవాలని పలువురు పోటీ పడుతున్నారు.

కానీ నాని అండ్ టీం మాత్రం కచ్చితంగా తమ సినిమాని ఆగస్ట్‌ 30 న రిలీజ్ చేయాలనీ ప్లాన్ వేస్తున్నారు. లేదంటే ఫ్రీ డేట్‌ పోయి మరేదైనా సినిమాతో క్లాష్‌ పెట్టుకోవాల్సి వస్తుందని కంగారు పడుతున్నారు. మరి షూటింగ్ అప్పటిలోపల కంప్లీట్ అయితే వెల్ అండ్ గుడ్ లేకపోతే రిలీజ్ డేట్ మార్చుకోవాల్సి వస్తుంది .

Sponsored links

Nani Gang Leader Movie Release Date:

Gang Leader Movie Release Date Fixed

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019