ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shocking News about Telugu Bigg Boss Season 3

తెలుగు బిగ్‌బాస్‌-3 గురించి షాకింగ్ న్యూస్!

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ అప్పట్లో పెద్ద హంగామానే జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ వ్యవహారం టాలీవుడ్ నుంచి వయా బాలీవుడ్‌.. హాలీవుడ్ వరకు పాకింది. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారం మీద వివాదాస్పద నటిగా పేరుగాంచిన శ్రీరెడ్డి పేరే ఎక్కువగా వినిపించింది. అయితే తాజాగా మరోసారి ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం వెలుగుచూసింది.

తెలుగులో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో.. త్వరలోనే మూడో సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ షోకు వ్యాఖ్యాతగా టాలీవుడ్ మన్మథుడు, అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల చివర్లో షో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంత వరకూ కంటెస్టెంట్లు ఎవరన్న విషయం తెలియరాలేదు. మరోవైపు పలువుర్ని సెలెక్ట్ చేసే వ్యవహారంలో ఈ షో గురించి షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది.

తెలుగు బిగ్‌బాస్‌-3 ప్రారంభం కాకమునుపే క్యాస్టింగ్ కౌచ్ అంటూ ప్రముఖ యూట్యూబ్ యాంకర్ శ్వేతా రెడ్డి సంచలనం రేపింది. ఇటీవల ఓ చానెల్‌ డిబెట్‌లో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.  ‘నాకు ఓ కో ఆర్డినేటర్ కాల్ చేసి.. మా బాస్‌ను ఎలా ఇంప్రెస్స్ చేస్తారు అని అడిగారు.. అంటే ఏంటి..? కమిట్మెంట్ అడుగుతున్నారా అని నేను కోపంగా అడిగాను.. అంతే  ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ కాల్ రాలేదు’ అని శ్వేతా రెడ్డి చెబుతోంది. అయితే ఇందులో నిజానిజాలెంత..? హడావుడి చేయడానికే ఇలా చెబుతున్నారా అనేది పైనున్న పెరుమాళ్లకే ఎరుక.

Swetha Reddy Allegations for Bigg Boss Entry

Shocking News about Telugu Bigg Boss Season 3
swetha reddy
bigg boss
season 3
casting couch
actress swetha reddy