‘ఇస్మార్ట్ శంక‌ర్‌’‌కే ఝలక్ ఇచ్చాడు

Mon 10th Jun 2019 05:17 PM
hero ram,ismart shankar,script,leaked,instagram  ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’‌కే ఝలక్ ఇచ్చాడు
ISmart Shankar Script On Instagram ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’‌కే ఝలక్ ఇచ్చాడు
Sponsored links

డైరెక్టర్ పూరి దర్శకత్వంతో రామ్ హీరో గా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈమూవీకి ఓ కొత్త సమస్య వచ్చి పడింది. చాలా సినిమాల మాదిరిగా ఈ సినిమాకి కూడా లీకేజీల గోల త‌ప్ప‌లేదు. సినిమా రిలీజ్ కి ముందే స్క్రిప్టు మొత్తాన్ని బ‌య‌ట పెట్టేశారు.

లీక్ చేసిన ఆ యువకుడు ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని తన ఇన్‌స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసేశాడు. దాంట్లో సీన్ నెం 1 నుంచి శుభం కార్డు వ‌ర‌కూ డైలాగ్ వెర్ష‌న్‌తో స‌హా అన్నీ ఉన్నాయి. విషయం తెలుసుకున్న పూరి అండ్ ఛార్మి వెంటనే పోలీస్ వారిని ఆశ్ర‌యించారు. మురళి కృష్ణ అనే వ్యక్తి ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని లీక్ చేశాడ‌ని పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

స్క్రిప్ట్ మొత్తం తన ఇన్‌స్ట్రాగ్రామ్ నుండి తీసేయడానికి భారీగా డబ్బు అడిగాడని ఛార్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాలో నటించే నటీనటులకు స్క్రిప్ట్ మొత్తం ఇవ్వడం పూరికి అలవాటు అని అలా ఆ స్క్రిప్ట్ చేతులు మారుతూ ముర‌ళీకృష్ణకు చేరింది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Sponsored links

ISmart Shankar Script On Instagram:

ISmart Shankar Script Leaked On Net

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019