Advertisement

చిరు-కొరటాల సినిమాకు మరో నిర్మాత!

Sat 09th Mar 2019 11:11 AM
mikkilineni sudhakar,producer,koratala shiva,chiranjeevi film  చిరు-కొరటాల సినిమాకు మరో నిర్మాత!
One More Producer Added to Koratala and Chiru Film చిరు-కొరటాల సినిమాకు మరో నిర్మాత!
Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్ మీద కంటే చిరంజీవి కెరీర్ మీదే ఎక్కువ శ్రద్ద పెట్టాడు. ఖైదీ నెంబర్ 150  సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు తరువాత సురేంద్ర రెడ్డి తో సైరా సినిమా చేస్తున్నాడు. ఈసినిమాను చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాడు. ఈచిత్రం తరువాత కొరటాలతో సినిమా కూడా చరణే నిర్మించనున్నాడు.

వచ్చేనెల ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈచిత్రానికి తన స్నేహితుడైన మిక్కిలినేని సుధాకర్‌ బ్యానర్లో చేయాలని కొరటాల అడిగాడట. ఎప్పటినుండో తనను వెయిటింగ్ చేయించుతున్నానని అంచేత అతనితో ఈచిత్రం చేస్తానని అడిగాడట. అయితే కొణిదెల  ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రం తీయాలని చరణ్‌ ఫిక్స్‌ అయిపోయాడు కాబట్టి సుధాకర్‌ని కూడా పార్టనర్‌గా చేర్చుకోవడానికి చరణ్‌ అంగీకరించాడట.

అయితే బిజినెస్ వ్యహారాలన్నీ కొరటాలే చూసుకుంటా అన్నాడట. అందుకు రామ్ చరణ్ సరే అని చెప్పాడని టాక్. ఇక ఈచిత్రంలో హీరోయిన్ కోసం వేట జరుగుతుంది. అయితే ఒక లీడ్ పాత్ర కోసం శృతి హాసన్ ని సంప్రదించారట. ఆమె ఓకే చెప్పడమే ఆలస్యం.

One More Producer Added to Koratala and Chiru Film:

Mikkilineni Sudhakar added to koratala and Chiru Film

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement