సూర్య‌కాంతం వ‌చ్చేసింది!

మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌రెడ్డి నిర్మించిన `ఒక మ‌న‌సు` చిత్రంతో తెరంగేట్రం చేసింది మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌. ఈ సినిమా పేరు తెచ్చినా హిట్‌ని అందించ‌లేక‌పోయింది. ఆ త‌రువాత చేపిన `హ్యాపీఎండింగ్‌` చూసిన వాళ్లంతా నిహారిక కెరీర్‌కి ఇది నిజంగా ఎండింగే అన్నారు. అయినా కెరీర్ విష‌యంలో రాజీప‌డ‌ని నిహారిక మ‌ళ్లీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డం మొద‌లు పెట్టింది. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తిలో క‌లిసి `ఒరు న‌ల్ల నాల్ పాతు సొల్రే` చిత్రంలో న‌టిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన నిహారిక తెలుగులో మ‌రో కొత్త త‌ర‌హా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. 

ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్‌తో క‌లిసి నిహారిక న‌టిస్తున్న తాజా చిత్రం `సూర్య‌కాంతం`. పేరుకు త‌గ్గ‌ట్టే గ‌య్యాలి పాత్ర‌లో నిహారిక కొణిదెల న‌టిస్తున్నఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మంగ‌ళ‌వారం నిహారిక కొణిదెల పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని విడుద‌ల చేశారు. వెబ్ సిరీస్‌లకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.  ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను డిజైన్ చేసిన తీరు ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఒక ప‌క్క ప్రేమ‌గా...మ‌రో ప‌క్క గ‌య్యాలిగా క‌నిపిస్తున్న తీరు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 

ఈ చిత్రానికి వ‌రుణ్‌తేజ్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధీప్ య‌ర్ర‌మ‌రెడ్డి, సుజ‌న్ య‌ర్ర‌బోలు, రామ్ న‌రేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `నిహారిక అప్‌క‌మింగ్ ఫిల్మ్ `సూర్య‌కాంతం` చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నందుకు ఆనందంగా వుంది. నిహారిక పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాం. అంద‌రికి న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను` అని వ‌రుణ్‌తేజ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాతో అయినా నిహారిక హిట్ ని త‌న ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

niharika as suryakantham

niharika suryakantham first look
niharika
niharika konidela
rahul vijay
pranith bramandapally
nirvana cinemas
varun tej
oka manasu
Advertisement
Advertisement