భానుమ‌తి మ‌ళ్లీ మ్యాజిక్ చేస్తుందా?

మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్‌ `ప్రేమ‌మ్‌` చూసేంత వ‌ర‌కు సాయి ప‌ల్ల‌వి టాలెంట్ గురించి ఎవ‌రికీ తెలియ‌లేదు. అది కొంత మందికే  అనుకోండి. ఆ త‌రువాత సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల త‌న‌ని తాను నిల‌బెట్టుకోవ‌డం కోసం చేసిన `ఫిదా` త‌రువాత సాయి ప‌ల్ల‌వి ఎంత టాలెంటెడో మ‌న జ‌నాలకే కాదు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కూ తెలిసిపోయింది. భానుమ‌తి ఒక్క‌టే పీస్ హైబ్రీడ్ పిల్లా.. రెండు కులాలు..రెండు మ‌తాలు అంటూ శేఖ‌ర్ క‌మ్ముల కెరీర్‌ని గాడిలో పెట్టిన ఈ త‌మిళ చిన్న‌ది భానుమ‌తిగా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేసుకుంది. 

తెలుగులో హీరోలు కూడా త‌మ షెడ్యూల్ ని ఆమెకు అనుకూలంగా మార్చుకునే స్థాయి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి రూపొందిస్తున్న రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`లో న‌టిస్తోంది. `ఫిదా`లో భానుమ‌తిగా ఫిదా చేసిన సాయి ప‌ల్ల‌వి ఈ సినిమాలో వైశాలిగా క‌నిపించ‌బోతోంది. బెంగాళీ అమ్మాయిగా సాయి ప‌ల్ల‌వి న‌ట‌నపైనే ఈ సినిమా ఫ‌లితం ఆధార‌ప‌డి వున్న‌ట్లు తెలుస్తోంది. దీనికితోడు ధ‌నుష్‌తో ఆమె న‌టించిన త‌మిళ చిత్రం `మారి-2` కూడా `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` విడుద‌ల‌వుతున్న 21నే తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌వుతోంది. 

ఈ రెండు సినిమాల‌కు సేలింగ్ పాయింట్ సాయి ప‌ల్ల‌వే కావ‌డం విశేషం. `మారి-2`లో మాసీవ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఆమె `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు`లో మాత్రం బెంగాళీ చిన్న‌దిగా అల‌రించ‌బోతోంది. ఇటీవ‌ల `క‌ణం`తో తొలి ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన ఈ త‌మిళ సోయ‌గం తాజాగా విడుద‌ల‌వుతున్న ఈ రెండు చిత్రాల‌తో భానుమ‌తి త‌ర‌హాలో రెచ్చిపోయి ఇద్ద‌రు హీరోల్ని గ‌ట్టెక్కిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. 

sai pallavi can repeat the magic

can sai pallavi repeat magic again
sai pallavi
sharwanand
hanu raghavapudi
padi padi leche manasu
fida
maari 2
shekhar kammula
kanam
Advertisement
Advertisement