ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shakalaka Shankar Uses Megastar Chiranjeevi Title

‘ఖైదీ’గా వస్తున్న కమెడియన్..!

శ్రీ భవాని ఫిలింస్‌ పతాకంపై జి.వరలక్ష్మి సమర్పణలో షకలక శంకర్‌ హీరోగా హనుమాన్‌ కృష్ణ దర్శకత్వంలో శ్రీనివాసరావు గొలుసు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఖైదీ.’ ఈ చిత్రం విజయదశమి కానుకగా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించుకోనుంది. ఇప్పటికే పాటల రికార్డింగ్‌ పూర్తి చేసుకుందీ చిత్రం. 

కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత శ్రీనివాసరావు గొలుసు మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి గారి కెరీర్‌ని మలుపు  తిప్పిన చిత్రం ‘ఖైదీ’. అలాంటి గొప్ప సినిమా టైటిల్‌ తో.. ఆ సినిమాకు ఏమాత్రం చెడ్డ పేరు తేకుండా షకలక శంకర్‌ హీరోగా ‘ఖైదీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మా దర్శకుడు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిస్తున్నారు. దసరా సందర్భంగా సినిమా షూటింగ్‌ గ్రాండ్‌గా ప్రారంభించనున్నాం’’ అన్నారు. 

Shakalaka Shankar Is Khaidi

Shakalaka Shankar Uses Megastar Chiranjeevi Title
shakalaka shankar
khaidi
chiranjeevi
megastar movie title
Advertisement
Advertisement