మహర్షి కోసం దిల్ రాజు సూపర్బ్ స్కెచ్

Dil Raju Sketch for MaharshiDil Raju Sketch for Maharshi

ఈమధ్యన తెలుగు స్టార్ హీరోల సినిమాలు హిందీ యూట్యూబ్ ని ఒక ఊపు ఊపేస్తున్నాయి. అందుకే తెలుగు స్టార్ హీరోల సినిమాలు హిందీ హక్కులకు భారీ క్రేజ్ తోపాటుగా డిమాండ్ కూడా ఏర్పడుతుంది. అల్లు అర్జున్ సినిమాలకైతే హిందీలో భారీ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ మూవీస్ హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ ని ఒక ఊపు ఊపేస్తున్నాయి. అలాగే సమంత - నితిన్ ల అ... ఆ సినిమా కూడా హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఇక తాజాగా తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాల మార్కెట్ మీద ఇప్పుడు హిందీ బడా నిర్మాణ సంస్థలు కన్నేశాయి. అందుకే ఇక్కడి దర్శక నిర్మాతలు కూడా హిందీ హక్కులకు భారీ ధర చెబుతున్నారు.

వంశి పైడిపల్లి - మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న మహేష్ 25 వ మూవీ మహర్షి సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం ఫారిన్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న మహర్షి సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు ఈ సినిమా నిర్మాత అయిన దిల్ రాజు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. అశ్విని దత్, పివిపితో కలిసి మహర్షి సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజు నిర్మించిన గత చిత్రాలు ప్లాప్ అవడంతో... ఇప్పుడు మహర్షితో ఆ లెక్కలు సరి చెయ్యాలని.. దిల్ రాజు చూస్తున్నట్లుగా మహర్షికి చెబుతున్న రేట్లతో అర్ధమవుతుంది. ప్రస్తుతం మహర్షి అంచనాలు తగ్గట్టుగా హిందీ హక్కులకు గాను దిల్ రాజు భారీగా 25  కోట్లు కోడ్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

మరీ అంత అంటే 25 కోట్లతో మహర్షి హిందీ హక్కులను ఎవరు దక్కించుకుంటారో. ప్రస్తుతం మహర్షి హిందీ హక్కుల రేటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే బోయపాటి సినిమాలు హిందీలో ఇప్పటివరకు భారీ రేటు పలుకుతూ వచ్చాయి. రామ్ చరణ్ తో బోయపాటి తెరకెక్కిస్తున్న RC12 కి కూడా 22 కోట్ల రేటు హిందీ హక్కులకు రేటు పలికింది. ఆ డీల్ కూడా క్లోజ్ అయ్యిందనే న్యూస్ ఉంది. మరి మహేష్ - వంశి చిత్రానికి 25 కోట్లు కోడ్ చేస్తున్నారంటే.. బయట మహర్షికి మరింత క్రేజ్ రాబట్టే దిల్ రాజు ఇలా ప్లాన్ చేస్తున్నాడేమో కానీ.. దిల్ రాజు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

Maharshi Movie Latest Update

dil raju
sketch
maharshi
mahesh babu
hindi dubbing