Advertisementt

అల్లు ఫ్యామిలీ మెగాభిమానం చాటుకుంది!

Fri 24th Aug 2018 11:56 AM
chiranjeevi,birthday,allu residence,pic,social media  అల్లు ఫ్యామిలీ మెగాభిమానం చాటుకుంది!
Chiranjeevi Birthday Celebrations In Allu Aravind House అల్లు ఫ్యామిలీ మెగాభిమానం చాటుకుంది!
Advertisement

గత రెండు రోజులుగా ఇండస్ట్రీ మొత్తానికి మెగా ఫీవర్ పట్టుకుంది. నిన్నగాక మొన్న చిరు పుట్టిన రోజు కానుకగా సై రా నరసింహారెడ్డి టీజర్ విడుదలై మెగా అభిమానులతో పాటుగా.. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులను కూడా ఆకట్టుకుంది. అలాగే అదే రోజు సాయంత్రం చిరంజీవి పుట్టినరోజు వేడుకల్ని శిల్పకళా వేదికలో అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక నిన్న చిరు పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లి మరీ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అలాగే ఇండస్ట్రీలోని చిన్న పెద్ద నటులు చిరుకి విషెస్ తెలియజేశాడు.

ఇక చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఆకాశాన్నంటాయి. ఇక నిన్న బుధవారం సాయంత్రం చిరంజీవి ఫ్యామిలీ మొత్తం అల్లు ఇంట సందడి చేసింది. అల్లు అరవింద్, అల్లు అర్జున్ స్పెషల్ గా తమ ఇంట్లో మెగా స్టార్ చిరు పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మెగా ఫ్యామిలిలో చిన్న పెద్ద అందరూ ఈ మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో సందడి చేసారు. మరి అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన చిరు పుట్టిన రోజు వేడుకలకి కొరటాల శివ, బోయపాటి శ్రీను, సుకుమార్, వంశి పైడిపల్లి, మెహెర్ రమేష్ వంటి స్టార్ డైరెక్టర్ కూడా హాజరయ్యారు. మరి ఈ డైరెక్టర్స్ అందరితో మెగా ఫ్యామిలీలోని రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫోటోలు దిగుతూ నానా అల్లరి చేశారు. అల్లు అర్జున్ ఇంట జరిగిన చిరు పుట్టిన రోజు వేడుకలు ఫొటోస్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఇక అల్లు శిరీష్ చిరు పుట్టిన రోజు వేడుకల్ని అల్లు ఇంట ఎలా జరిపామో చెబుతూ ఆ ఫొటోస్ తో పాటుగా.. అల్లు నివాసంలో మెగాస్టార్ బర్త్ డే బాష్. బాస్‌, బాయ్స్, నిన్న పార్టీకి హాజరైన డైరెక్టర్లతో ఓ పిక్. ఈ పిక్‌ను మా డాడీ తీశారు అంటూ ట్వీట్ చేసాడు.

Chiranjeevi Birthday Celebrations In Allu Aravind House:

Pic: Mega Celebrations @ Allu Residence

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement