హ్యాపీ వెడ్డింగ్ హిట్ పక్కా..!!

Happy Wedding Censor Completed

Fri 13th Jul 2018 10:51 PM
happy wedding,niharika,sumanth ashwin censor,details  హ్యాపీ వెడ్డింగ్ హిట్ పక్కా..!!
Happy Wedding Censor Completed హ్యాపీ వెడ్డింగ్ హిట్ పక్కా..!!
Advertisement

మెగా డాటర్ నిహారిక - బడా నిర్మాత ఎం ఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ జంటగా వస్తున్న హ్యాపీ వెడ్డింగ్ సినిమా ఈ నెల 28 న విడుదలకు సిద్దమవుతుంది. ప్రస్తుతం పోస్టర్స్ అండ్ ట్రైలర్ లు సినిమా మీద మంచి అంచనాలు పెంచేలా చేశాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అలాగే పెళ్లి జరిగే టైం లోని పరిణామాలను ఎంతో చక్కగా దర్శకుడు లక్షణ్ చూపించినట్లుగా మనకు ట్రైలర్  చూస్తుంటే తెలుస్తుంది. మరి మంచి అంచనా మధ్యన ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ హ్యాపీ వెడ్డింగ్ సినిమాకి సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ సెన్సార్ ని ఇచ్చేశారు. ఈ రోజు స్పెషల్ గా హ్యాపీ వెడ్డింగ్ సినిమాని వీక్షించిన సెన్సార్ సభ్యులు ఈ సినిమా చాలా బావుందని.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందని.... క్లీన్ యు సరిటిఫికేట్ జారీచేశారని విశ్వసనీయ సమాచారం. మరి ఈ సినిమాతో మెగా డాటర్ నిహారిక, మెగా నిర్మాత కొడుకు అయిన సుమంత్ అశ్విన్ లు హిట్ అందుకుంటారని ఈ సెన్సార్ సర్టిఫికెట్ చూస్తుంటేనే అర్ధమవుతుంది.

Happy Wedding Censor Completed:

Happy Wedding Censor Details


Loading..
Loading..
Loading..
advertisement