Advertisementt

డబ్బుంటే బాలీవుడ్ ఏంటి.. టాలీవుడ్ ఏంటి?

Tue 10th Jul 2018 10:46 AM
jacqueline fernandez,nikhil kumar,seetharama kalyana,dance  డబ్బుంటే బాలీవుడ్ ఏంటి.. టాలీవుడ్ ఏంటి?
Jacqueline Fernandez in a Kannada movie? డబ్బుంటే బాలీవుడ్ ఏంటి.. టాలీవుడ్ ఏంటి?
Advertisement
Ads by CJ

ఆయన తాత దేశ మాజీ ప్రధాని. తండ్రి ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి. మరి అలాంటి వారి వారసుడి సినిమా అంటే బడ్జెట్‌ గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు. బెల్లంకొండ సురేష్‌ వంటి వారే తమ కుమారుడైన బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ కోసం వినాయక్‌, బోయపాటి శ్రీను, సమంత, తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌, పూజాహెగ్డే, శరత్‌కుమార్‌, జగపతిబాబు వంటి వారిని తెచ్చి మరీ భారీ బడ్జెట్‌తో చిత్రాలు నిర్మిస్తుంటే మరి దేవగౌడ, కుమారస్వామిలు మౌనంగా ఉంటారు. 

ఇక కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ ఇటీవల 'జాగ్వార్‌' అనే భారీ చిత్రం ద్వారా కన్నడ, తెలుగు భాషల్లో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో తమన్నా స్పెషల్‌ గీతంలో నర్తించగా, రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి వారు అందులో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్‌ కాలేదు. కానీ అది కుమారస్వామి వంటి వారికి ఓ లెక్కలోకి కాదు తాజాగా నిఖిల్‌ రెండో చిత్రం ప్రారంభమైంది. కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌లు కలిసి నటించిన 'రారండోయ్‌ వేడుక చూద్దాం' చిత్రం చైతు కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రం రీమేక్‌గా రూపొందుతున్న 'సీతారామకళ్యాణం' చిత్రంలో నిఖిల్‌ హీరోగా నటిస్తున్నాడు. హర్ష దర్శకత్వం వహిస్తోన్న ఇందులో రచిత రామ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, శరత్‌కుమార్‌ కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 

ఇక ఈ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌కి అవకాశం ఉండటంతో భారీ రెమ్యూనరేషన్‌ని ఇచ్చి బాలీవుడ్‌ స్టార్‌, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌తో ఈ పాటను చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక కన్నడ వాసే అయిన దీపికాపడుకోణే నేడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌. ఇక గతంలో జుహీచావ్లా వంటి వారు కూడా బాలీవుడ్‌ నుంచి వచ్చి శాండల్‌వుడ్‌లో కొన్ని చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. 

Jacqueline Fernandez in a Kannada movie?:

Jacqueline Fernandez dance performance in Nikhil Kumar’s upcoming film Seetharama Kalyana.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ