'వీరరాఘవ'లో ఎన్టీఆర్ పాత్రేమీ లేదంట!

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ. త్రివిక్రమ్ మార్క్ మిస్ అవ్వకుండా ఈ సినిమాలో చాలానే జాగ్రత్తలు తీసుకుని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ గా ఈ టైటిల్ పై ఫిలింనగర్ లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మొదట త్రివిక్రమ్ ఈ సినిమాకు 'అరవింద సమేత' అనే టైటిల్ మాత్రమే పెడదాం అనుకున్నాడు. కానీ టైటిల్ కింద తన పాత్ర పేరైన 'వీరరాఘవ' ఉంచమని ఎన్టీఆర్ పట్టుబట్టాడనేది ఆ వార్త సారాంశం. అలా చేయకపోతే ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అనుకునే అవకాశం ఉందని ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి చెప్పడంతో  'అరవింద సమేత వీర రాఘవ' అని పెట్టారట.

మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త హల్ చల్ అవుతుంది. అయితే టైటిల్ విషయంలో ఎన్టీఆర్ జోక్యమే చేసుకోలేదనేది త్రివిక్రమ్ సన్నిహితుల మాట. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు ఈషా రెబ్బ కూడా  హీరోయిన్ గా నటించనుంది.

Aravinda Sametha is Trivikram Mark Title

NTR Clarity on Aravinda Sametha Title
aravinda sametha
trivikram srinivas
jr ntr
title
veera raghava