బాలీవుడ్ లో ప్రభాస్ కి నచ్చిన సినిమా ఇదే!

గత కొన్నిరోజులుగా బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు, 'బాహుబలి' హిందీ వెర్షన్ నిర్మాత కరణ్‌జోహార్‌కి ప్రభాస్‌కి మధ్య మనస్పర్దలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌తో స్ట్రెయిట్ బాలీవుడ్ చిత్రం తీయాలని కరుణ్ జోహార్ ప్రభాస్ కాల్షీట్స్ కోరినప్పటికీ ఈయన అందుకు అంగీకరించలేదని కొందరు, కాదు ప్రభాస్ ఏకంగా 50కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడని మరికొందరు అంటున్నారు.
ఇక తాజాగా దుబాయ్‌లో ప్రభాస్ మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయాన్ని కొట్టివేశారు. తనకు చాలా బాగా ఇష్టమైన చిత్రం కరణ్‌జోహార్ తీసిన 'కుచ్ కుచ్ హోతాహై' అని ప్రభాస్ చెప్పాడు. మరి మీకు, కరణ్‌జోహార్‌కి 'కుచ్ కుచ్ ప్రాబ్లమ్ హై' అట కదా.. అంటే అదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ తమ మధ్య 'కుచ్ కుచ్ నహీ హై' అని క్లారిటీ ఇస్తూ ఇదే విషయం కరణ్‌జోహార్ తనకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో తామిద్దరం ఫోన్‌లో నవ్వుకున్నామని ప్రభాస్ తెలిపాడు.
ఇక ప్రస్తుతం తన దృష్టి అంతా తెలుగు సినిమాల మీదనే ఉందని, భవిష్యత్తులో బాలీవుడ్ చిత్రాల గురించి ఆలోచిస్తానని ప్రభాస్ దుబాయ్ మీడియాతో మాట్లాడుతూ, స్పష్టం చేయడంతో ఈ పుకార్లకు కాస్త బ్రేక్ పడిందనే చెప్పాలి.
Kuch Kuch Hota Hai is My Favourite Film, Says Prabhas
Prabhas Favourite Movies in Bollywood







































