'నా నువ్వే' పోస్టర్ అదిరింది..!

Wed 18th Apr 2018 02:12 AM
naa nuvve,kalyan ram,mahesh koneru,tamanna,jayendra  'నా నువ్వే' పోస్టర్ అదిరింది..!
Naa Nuvve First Single Release Date 'నా నువ్వే' పోస్టర్ అదిరింది..!
Sponsored links

కళ్యాణ్ రామ్... సినిమా ఫలితాలెలా ఉన్నా కూడా తాను చేస్తున్న సినిమాలకు అస్సలు గ్యాప్ రానివ్వడు. అసలు కళ్యాణ్ రామ్ కెరీర్ లో 90 శాతం ప్లాపులుంటే 10  శాతం మాత్రమే హిట్స్ ఉన్నాయి. అది కూడా వేళ్ళ మీద లెక్కపెట్టుకునేంత హిట్స్ మాత్రమే. కానీ సినిమాలు చెయ్యడానికి మాత్రం అస్సలు గ్యాప్ తీసుకోడు కళ్యాణ్ రామ్. మిన్నటికి మొన్న 'ఎమ్యెల్యే' గా వచ్చేసిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు తమన్నాతో కలిసి 'నా నువ్వే' అంటున్నాడు. ఎమ్యెల్యే సినిమాతో ఖంగుతిన్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 'నా నువ్వే' తో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ పనుల్లో మునిగితేలుతున్న కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

మొన్నీమధ్యనే 'నా నువ్వే' టీజర్ ని విడుదల చేసిన చిత్ర బృందం ప్రస్తుతం ఒక్కో ఫోటోని బయటికి వదులుతుంది. ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్ర బృందం ఈ బుధవారం సాయంత్రం 'చినికి చినికి' అనే సాంగ్ టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు. మరి టీజర్ డేట్ తో పాటు వదిలిన పోస్టర్ లో కళ్యాణ్ రామ్ అండ్ తమన్నాల జంట అదరగొట్టేస్తుంది. ఆ పోస్టర్ లో ఈ జంట ఎంత లవ్లీ గా ఉందో మీరే చూడండి. ప్రేమ సింబల్ లో కళ్యాణ్ రామ్ ప్రేమగా తమన్నాని హాగ్ చేసుకున్న ఆ పోస్టర్ సూపర్ గా వుంది. మరి తమన్నా అందాలు, కళ్యాణ్ రామ్ లుక్ ఇలా 'నా నువ్వే' సినిమాకి  దనపు ఆకర్షణలుగా ఉన్నాయి.

ఇక ఈ సినిమా యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వంలో.... లవ్ స్టోరీగా ఉండబోతుంది అనేది మాత్రం ఈ పోస్టర్ ద్వారా పూర్తిగా అర్ధమవుతుంది. చూద్దాం 'ఎమ్యెల్యే' తో విజయాన్ని అందుకోలేని కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' తో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటాడో తెలియాలంటే మే నెల 25న వరకు వెయిట్ చేయక తప్పదు.

Sponsored links

Naa Nuvve First Single Release Date:

Naa Nuvve movie New Poster Hulchal in Social Media

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019