సమంత గట్టిగా క్లాస్ ఇచ్చింది..!

Sat 10th Feb 2018 10:35 PM
samantha ruth prabhu,response,bikini picture,trolling,fans  సమంత గట్టిగా క్లాస్ ఇచ్చింది..!
Samantha Akkineni, trolled for her bikini picture సమంత గట్టిగా క్లాస్ ఇచ్చింది..!

నేటి సమాజంలో పలువురు వ్యక్తులు పోతోన్న వింత పోకడలకు వారికి వారు స్వేచ్చ అనో లేక మా ఇష్టం అనో, మమ్మల్ని అదుపులో పెట్టడానికి మీరెవ్వరనో ఇలా పలు రకాలుగా వాదిస్తున్నారు. అయినా మనం సమాజంలో ఉన్నామని, మనమేమీ అడవుల్లో అనాగరిక సమాజంలో లేమని కొందరు సెలబ్రిటీలు గుర్తుంచుకోవాలి. వారికి సమాజంలో ఉండటానికి, సమాజ కట్టుబాట్లను అనుసరించే ఉద్దేశ్యం లేనప్పుడు ఎవ్వరూ ఏమి చేయలేరు. మేము మా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాం అని వర్మలాగా మాట్లాడితే అది వారి విజ్ఞతకు వదిలేయాల్సిన విషయమే. ఇప్పుడు అక్కినేని ఇంటి కోడలు సమంత కూడా అదే పని చేస్తోంది. పెళ్లయిన తర్వాత కూడా 'రాజుగారి గది2, రంగస్థలం1985, మహానటి, అభిమన్యుడు' వంటి చిత్రాలతో బిజీగా ఉన్న సమంత తాజాగా కాస్త రిలాక్స్‌ అవుతూ, తమిళనాడులోని టెన్‌కాశీలో విరామ సమయంలో బికినీ ధరించి విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. 

చాలా అలిసిపోయానని, ఇది రిలాక్స్‌ సమయమని, కావాలని కాదు గానీ బికీనీ తనకు చాలా అవసరమని ఆమె పోస్ట్‌ చేసింది. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సంచలనంగా మారింది. సమంత ఇలా షాక్‌ ఇచ్చింది ఏందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆమె కేవలం సినీ నటి మాత్రమే కాదని, ఆమె తెలుగులో పేరు మోసిన అక్కినేని వారి ఇంటి కోడలు అన్న విషయాన్ని గుర్తించుకోవాలని కొందరు సూచిస్తున్నారు. పెళ్లయిన ఓ యువతి బికినీ వేయవచ్చని, కానీ దానిని పోస్ట్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు మండిపడుతున్నారు. ఇలా మరికొందరి తీవ్ర విమర్శలను తిప్పి కొడుతూ సమంత వారికి రిప్లై ఇచ్చింది. తన గత పోస్ట్‌ ఏమంత అభ్యంతరకరంగా లేదని, తన రూల్స్‌ని తాను రాసుకుంటానని, అభిమానులు, ఇతరులు తన నియమాలను తనకు రాయలేరని తెలిపి ఎవరి రూల్స్‌ వారు రాసుకుంటేనే బాగుంటుందని సలహా ఇచ్చింది. 

ఇది ఆమె స్వేచ్చ అనే విషయాన్ని ఒప్పుకుంటే మరి మహేష్‌బాబు నటించిన '1' నేనొక్కడినేలో బీచ్‌లో ఉండే కృతిసనన్‌ పోస్టర్‌ కూడా కృతిసనన్‌ నిర్ణయం. దానికి దర్శకత్వం వహిస్తున్న సుకుమార్‌, హీరో మహేష్‌బాబులకు కూడా అది స్వేచ్చే కదా.. ! మరి నాడు ఆ పోస్టర్‌ని వారి ఇష్టానికి వారిని వదిలేయకుండా సమంత తనదైన తీర్పుని ఆ పోస్టర్‌ విషయంలో ఎందుకు ఇచ్చి, మధ్యలో ఆ విషయంలో ఆమె ఎందుకు జోక్యం చేసుకుందో కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తనకో న్యాయం, కృతిసనన్‌కి మరో న్యాయమా సమంతా? 

Samantha Akkineni, trolled for her bikini picture:

Samantha Ruth Prabhu Has A Befitting Response To Everyone Trolling Her For Posing In A Bikini