నాగ్ మాట కూడా వినడం లేదుగా?

ఎవరిమాట వినకుండ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు రామ్ గోపాల్ వర్మ. అయితే నాగ్ పెట్టిన షరతు వల్ల వర్మ ఏ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్  అవకుండా నాగ్ చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ కొన్ని రోజులకే సీన్ రివర్స్ అయింది. నాగ్ చెప్పిన మాట లెక్క చేయకుండా వర్మ మళ్లీ మొదటికి వచ్చాడు. ఏంటండీ ఏమి అర్ధం కాలేదా..అదేనండి..

నాగ్ - వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా..! ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు నాగ్.. వర్మకి నువ్వు సినిమా మీదే ఫోకస్ పెట్టాలి వేరే మ్యాటర్స్ కానీ.. వేరే సినిమాల గురించి కానీ పట్టించుకోకూడదు. దీనికి నీకు ఒకే అయితేనే మనం సినిమా స్టార్ట్ చేద్దాం అని నాగ్ షరతు పెట్టాడు. అందుకు వర్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఈ సినిమాపైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. కానీ కొన్ని రోజుల్లోనే సీన్ రివర్స్ అయింది. ముందుగా కడప ఫ్యాక్షనిజం మీద ‘కడప’ అనే వెబ్ సిరీస్ తో కొన్ని రోజులు కలకలం రేపాడు. ఆ తర్వాత ఇప్పుడు రెండు వారాల నుంచి ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ అంటూ పోర్న్ స్టార్ తో సినిమా అంటూ రచ్చ రచ్చ చేస్తున్నాడు.

అయితే ఇప్పుడు అందరికి ఒకటే సందేహం.. నాగ్ వర్మకు పెట్టిన షరతులు ఏమయ్యాయి అని. నాగ్ కి వున్న ఇమేజ్ ప్రకారం చూస్తే తనతో సినిమా తీస్తూ వర్మ ఇలా చేయడం ఆయనకు చాలా ఇబ్బంది కలిగించే విషయమే. మరి నాగ్..వర్మని కంట్రోల్ చేయట్లేదా అన్న సందేహం కూడా జనాల్లో ఉంది. సినిమా స్టార్ట్ చేసి మధ్యలో వచ్చేశాక నాగ్ మాత్రం ఏం చేయగలడు అన్న తర్కం కూడా తెరమీదికి వస్తోంది.

Nagarjuna Unhappy with RGV Moves

RGV Neglects Nagarjuna
nagarjuna
ram gopal varma
god sex and truth
gst
kadapa
king nag
varma
Advertisement
Advertisement