ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pawan Kalyan Agnathavasi Movie Pre Release Business Sensation

'అజ్ఞాతవాసి' చెబుతుంది పవన్ స్టామినా ఏంటో?

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' సంచలనాలు అప్పుడే మొదలయ్యాయి. సినిమా విడుదలకు ఇంకా దాదాపు 25 రోజులు టైం ఉన్నప్పటికీ.. పవర్ స్టార్ పవర్ ఫుల్ స్టామినా.. టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే.. 147 కోట్ల రూపాయల భారీ మొత్తానికి ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయిందన్న టాక్ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. ఈ లెవల్లో అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ బిజినెస్ చెయ్యడం కేవలం పవర్ స్టార్ అభిమానులనే కాదు.. ఇండస్ట్రీ జనాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాపై ఏ లెక్కన అంచనాలున్నాయి ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ చాటి చెబుతుంది. పవన్ - త్రివిక్రమ్... ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. దీంతో.. అజ్ఞాతవాసి సినిమా కూడా సెన్సేషన్ హిట్ కావడం ఖాయమని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. పైగా.. పవన్ కూడా.. అజ్ఞాతవాసి సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తుండడం.. పవన్ కళ్యాణ్ స్నేహితుడు విక్టరీ వెంకటేష్ ముఖ్య పాత్రను పోషిస్తుండడం.. అంతేకాకుండా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఇచ్చిన సంగీతం ఇప్పటికే యూట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ లో ఉండడం.. ఇలా ఎటు చూసినా.. అజ్ఞాతవాసిపై పాజిటివ్ బజ్జే క్రియేట్ అవుతోంది.

కేవలం ఈ కారణాలే.. అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ బిజినెస్ ను పీక్స్ కు తీసుకెళ్లాయి అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారికి అజ్ఞాతవాసి సినిమా కాసులు వర్షం కురిపించినట్లే. ఇకపోతే 147 కోట్ల బిజినెస్ కి లాభాల బాట పట్టాలంటే.. కనీసం 200 కోట్లు కలెక్షన్ రావాలి. చూద్దాం పవన్ స్టామినా ఆ 200  కోట్లు కలెక్ట్ చేస్తుందా... లేదా అనేది.

Full Positive Buzz on Pawan Kalyan Agnathavasi Movie

Pawan Kalyan Agnathavasi Movie Pre Release Business Sensation
agnathavasi
pawan kalyan
business
stamina
trivikram srinivas
venkatesh