Advertisement

'బాహుబలి' కి అంతసీన్‌ లేదని ఒప్పుకున్నాడు...!

Mon 31st Jul 2017 01:59 PM
star writer vijayendra prasad,baahubali 2 movie,dangal movie,china  'బాహుబలి' కి అంతసీన్‌ లేదని ఒప్పుకున్నాడు...!
Vijayendra Prasad Says Dangal Bigger Than Baahubali 2 'బాహుబలి' కి అంతసీన్‌ లేదని ఒప్పుకున్నాడు...!
Advertisement

'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' కంటే ముందుగా విడుదలైన అమీర్‌ఖాన్‌ నటించిన 'దంగల్‌' 800 కోట్లను వసూలు చేసి ఇండియన్‌ సినిమాలో మొదటి స్థానంలో నిలిచింది. కానీ 'బాహుబలి 2' ఏకంగా 1500 కోట్లను వసూలు చేసి రికార్డులు సృష్టించింది. దాంతో ఆలస్యంగా 'దంగల్‌'ని చైనీస్‌ భాషలోకి అనువదించి అక్కడ భారీగా రిలీజ్‌ చేయడంతో ఈ చిత్రం 'బాహుబలి 2'ని పక్కనపెట్టి చైనాలో భారీ కలెక్షన్లు కొల్లగొట్టి 2000 కోట్ల క్లబ్‌లో స్థానం సాథించి మరలా భాహుబలిని వెనక్కి నెట్టింది. 

ఇక తాజాగా 'బాహుబలి' నిర్మాతలు కూడా ఈ చిత్రాన్ని త్వరలోనే చైనాలో భారీగా రిలీజ్‌ చేసి 'దంగల్‌' రికార్డులను అధిగమించాలని రాజమౌళితో పాటు ఈ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి , రచయిత విజయేంద్రప్రసాద్‌ స్పందించడమే కాదు.. సంచనల వ్యాఖ్యలు చేశారు. 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రం చైనాలో 'దంగల్‌' స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టలేదని, ఈచిత్రానికి అంత సీన్‌ లేదన్నారు. ఇలాంటి డ్రామా చిత్రాలను చైనీస్‌ ఎప్పుడో చూసేశారని, వారికి ఇదేమీ వారికి కొత్త సబ్జెక్ట్‌ కాదని, దాంతో ఈ చిత్రం 'దంగల్‌'ని దాటలేదని తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పారు. 

'దంగల్‌' చిత్రంలోని తన తండ్రి కోరికను తీర్చే బాలికలుగా వచ్చిన పాయింట్‌ ఉమెన్‌ సెంట్రిక్‌ డ్రామాకు చైనీయులు బాగా కనెక్ట్‌ కావడంతోనే ఈ చిత్రం అక్కడ అంతగా కలెక్షన్లు సాధించిందిన, 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' కి అంత సీన్‌ లేదని చెప్పడం హాట్‌ టాపిక్‌ అయింది. ఇక 'బాహుబలి' నిర్మాతలు మాత్రం త్వరలో చైనాలో విడుదలవున్న చిత్రం మంచి విజయాన్ని సాధించి, కలెక్షన్లు కొల్లగొడుతుందని, 'దంగల్‌' స్థాయిలో కాకపోయిన 'బాహుబలి 1' లాగా మాత్రం ఫలితం ఉండదని, తమ చిత్రం ఈసారి ఖచ్చితంగా డీసెంట్‌ కలెక్షన్లు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. చూద్దాం.. ఫలితం ఎలా ఉంటుందో...? 

Vijayendra Prasad Says Dangal Bigger Than Baahubali 2:

Vijayendra Prasad Admits Baahubali 2 Can't Surpass Dangal.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement