Advertisementt

డైరెక్టర్ కి గిఫ్ట్ ఇచ్చిన హీరో..!

Thu 16th Feb 2017 11:48 AM
s 3 movie,hero surya,director hari,surya gift prasent to director hari  డైరెక్టర్ కి గిఫ్ట్ ఇచ్చిన హీరో..!
డైరెక్టర్ కి గిఫ్ట్ ఇచ్చిన హీరో..!
Advertisement
Ads by CJ

సింగం సీరీస్ తో సూర్య తిరుగులేని హిట్స్ కొట్టుకుంటూ పోతున్నాడు. తాజాగా సింగం సిరీస్ లో విడుదలైన 'సింగం 3' చిత్రంతో సూర్య మళ్లీ హిట్ కొట్టాడు. ఇక పవర్ ఫుల్ చిత్రాలను డైరెక్టర్ హరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని డైరెక్ట్ చేస్తున్నాడు సింగం సీరీస్ ని. సూర్య డిఫ్రెంట్ డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా అవి సూర్య ఆశించిన రీతిలో ప్రేక్షకులని మెప్పించలేక చతికిలపడుతున్నాయి. అయితే సింగం సీరీస్ లో సూర్య పోలీస్ పాత్రకి మాత్రం ప్రేక్షకులు జై జై లు పలుకుతున్నారు. ఈ ఎస్ 3  చిత్రం గత మూడు నెలలుగా మూడుసార్లు వాయిదాలు పడి ఎట్టకేలకు ఫిబ్రవరి 9న ఒకేసారి తెలుగు, తమిళ్ లో విడుదలైంది.

ఇక విడుదలైన రోజు నుండి పాసిటివ్ టాక్ తో రన్ అవుతూ... బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా మంచి యాక్షన్ చిత్రంగా దూసుకుపోతుంది. ఇంతటి మంచి చిత్రాన్ని తనకి గిఫ్ట్ గా ఇచ్చిన డైరెక్టర్ హరికి సూర్య కూడా టొయోటా ఫార్చూనర్ కారును గిఫ్ట్ గా ఇచ్చి కృతజ్ఞతను చాటుకున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో ఇలా బహుమతుల ఆచారం ఈ మధ్యన ఎక్కువగా కనబడుతుంది. ఇక సూర్య కూడా తాజాగా ఇచ్చిన టొయోటా ఫార్చూనర్ కారు గిఫ్ట్ తో అక్కడ కూడా ఈ సంప్రదాయం బాగా ఎక్కువయ్యేలా కనబడుతుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ