అనుపమ డబ్బు మనిషేం కాదంట..!

Fri 27th Jan 2017 11:38 PM
Advertisement
anupama parameswaran,mythri movie makers,remuneration,sukumar,ram charan  అనుపమ డబ్బు మనిషేం కాదంట..!
అనుపమ డబ్బు మనిషేం కాదంట..!
Advertisement

టాలీవుడ్ లో లక్కీ గాళ్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్. ఈ భామ తెలుగులో నటించిన అ..ఆ, ప్రేమమ్, శతమానం భవతి వంటి చిత్రాలు మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూడు హిట్టులతో మంచి క్రేజ్ తో పాటు స్పీడ్ మీదున్న ఈ భామ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చే సినిమాకు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారి పోయింది.  తాజాగా ఎన్టీఆర్ కొత్త మూవీ జై లవకుశ లో ఓ హీరోయిన్ గా నటిస్తుందనే టాక్ కూడా వస్తుంది. ఈ విషయంపై ఆమెను అడిగితే ప్రస్తుతం కథలన్నీ వింటున్నానని, ఏదీ ఇంకా కన్ఫాం కాలేదని అనుపమ వివరించింది. అంటే ఈ సినిమాలో కూడా ఛాన్స్ దక్కలేదనే అనుకోవాలి. 

కాగా రామ్ చరణ్ సినిమాలో నటించాల్సిన అనుపమ ఎందుకు తప్పించారని విచారిస్తే.. అనుపమ ఈ చిత్రానికి గాను.. 60 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ అడిగిందనీ, అందుకనే ఆమెను ఆ చిత్రం నుండి తప్పించారనే టాక్ కూడా నడుస్తుంది. ఈ విషయంపై ఈ చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా రామ్ చరణ్ తో సుకుమార్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు చేస్తున్నారు. దీంతో అనుపమపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తను మైత్రీ మూవీ మేకర్స్ ఖండించింది. అనుపమ... రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లోని ప్రాజెక్టులో లేని విషయం నిజమే కానీ, సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా ఆమెను రెమ్యూనరేషన్ కారణంగా తప్పించారన్న విషయంలో ఏమాత్రం వాస్తవం లేదని, అంతేకాకుండా అనుపమ ఈ ప్రాజెక్టులో కాకపోతే తర్వాత ప్రాజెక్టులో పని చేస్తుందని ఆ సంస్ధ వెల్లడించింది. మొత్తానికి అనుపమ డబ్బు మనిషి కాదని తేలిపోయిందిగా..  

Advertisement
Advertisement

Loading..
Loading..
Loading..
advertisement