Advertisement

దేవిశ్రీ మార్క్ సాంగ్..'యు&మీ' అదిరింది!

Thu 29th Dec 2016 12:45 PM
devisri prasad,khaidi no 150,u and me song,melody song,chiranjeevi,kajal  దేవిశ్రీ మార్క్ సాంగ్..'యు&మీ' అదిరింది!
దేవిశ్రీ మార్క్ సాంగ్..'యు&మీ' అదిరింది!
Advertisement

చిరంజీవి 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' ఆడియో వేడుకని జరపకుండా సాంగ్స్ ని నేరుగా ఒక్కొక్కటి మార్కెట్ లోకి రిలీజ్ చేసేస్తున్నారు. 'ఖైదీ.... ' కి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ 'ఖైదీ నెంబర్ 150' మ్యూజిక్ అదరగొట్టేసాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్  చూస్తుంటే 'ఖైదీ...' ఆల్బమ్ సంచలనం సృష్టించడం ఖాయంగా తెలుస్తుంది. ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఆడియో సాంగ్స్ అన్నీ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. మొదటి సాంగ్ గా రిలీజ్ చేసిన 'అమ్మడు లెట్స్  డు కుమ్ముడు' సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంటే..ఆ తర్వాత వచ్చిన 'సుందరి' సాంగ్ కూడా అదరహో అనిపించింది. ఇక తాజాగా రిలీజ్ అయిన 'యూ అండ్ మీ  సాంగ్' మెలోడీగా సూపర్బ్ మ్యూజిక్ తో ఆకట్టుకుంటోంది. ఈ పాటతో దేవిశ్రీ తన మెలోడీ స్పెషల్ మార్క్ ను మరోసారి చూపించాడు. ఈ పాటలు వింటుంటే..చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' చిత్రం ఆల్బమ్.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో ది బెస్ట్ గా నిలుస్తుందనడం లో ఏ మాత్రం సందేహం లేదు. 

ఇక ఈ సాంగ్స్ ఇప్పటివరకు ఆడియోలోనే విడుదల చేసారు. ఇక వీడియో సాంగ్స్ విడుదల చేస్తే చిరు, కాజల్ డాన్స్ పెరఫామెన్స్ కి మెగా ఫ్యాన్స్ పడిపోయేవారు. ఈ సినిమా ఆడియోని కొన్ని కారణాల వల్ల వైభవంగా జరపలేకపోయినప్పటికీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని మాత్రం అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ ఫంక్షన్ ని విజయవాడలో జనవరి 4  న జరుగనుంది. ఈ  ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగా బ్రదర్స్ తో పాటు ఫ్యామిలీ మెంబెర్స్ కూడా హాజరవుతారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ఫంక్షన్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement