పవన్ సినిమాలో ఆమె కన్ఫర్మ్ అంట..!

Wed 28th Dec 2016 09:01 PM
pawan kalyan,khushboo,trivikram,pawan trivikram combination movie,keerthy suresh  పవన్ సినిమాలో ఆమె కన్ఫర్మ్ అంట..!
పవన్ సినిమాలో ఆమె కన్ఫర్మ్ అంట..!
Sponsored links

9  ఏళ్ళ తర్వాత తమిళ్ యాక్ట్రెస్ ఖుష్బూ మళ్ళీ తెలుగులో కనిపించనుంది. చాలా గ్యాప్ తీసుకుని తెలుగులో నటించబోతుంది. ఆ మధ్యన ఖుష్బూ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతుందని వార్తలొచ్చాయి. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో ఖుష్బూ ఒక కీలక పాత్రకి ఎంపికైదని సమాచారం. అయితే ఈ ఆఫర్ రావడంపై ఖుష్బూ చాలా సంతోషంగా ఉందట.

త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఖుష్బూ వెంటనే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుందని అంటున్నారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఖుష్బూ నే తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఇక పవన్ తన 'కాటమరాయుడు' సినిమా పూర్తవ్వగానే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. ఇక పవన్ షూటింగ్ కి హాజరవగానే శరవేగంగా ఈ సినిమాకి షూటింగ్ జరపడానికి త్రివిక్రమ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు ఖుష్బూ ని కూడా కన్ఫర్మ్ చేసాడు.

ఇక ఖుష్బూ పవన్ అన్న చిరంజీవి తో తొమ్మిదేళ్ల క్రితం 'స్టాలిన్' చిత్రంలో నటించింది. మళ్ళీ 9  ఏళ్ళ తర్వాత తమ్ముడు పవన్ సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ తొమ్మిదేళ్ల గ్యాప్ లో ఖుష్బూ మారే తెలుగు సినిమాలో నటించలేదు. ఇక చాలా గ్యాప్ తర్వాత పవన్ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉందని అంటోంది. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019