హీరోయిన్ లైంగిక వేధింపులు క్రేజ్ కోసమేనా..!!

CineJosh news

ఆమె ఒక స్టార్ హీరో కూతురు. ఆమె కూడా ఇప్పుడు బాలీవుడ్ లో టాప్  హీరోయిన్. అనిల్ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ లో కాలుపెట్టిన సోనమ్ తన స్వశక్తితో ఎదిగింది. సోనమ్ బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ గా కూడా పేరు సంపాదించింది. స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేస్తూ బిజీ తారగా వున్న సోనమ్ ఇప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు చెప్పి అందరిని నోటా మాటరాకుండా చేసింది. అదేమిటంటే అనుష్కశర్మ, విద్యాబాలన్, రాధికా ఆప్టే.... మొదలగు హీరోయిన్స్ తో రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొన్న సోనమ్ కొన్ని సంచలనాత్మక విషయాలు చెప్పింది. తాను తన చిన్న తనంలోనే లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పి అందరిని షాక్ కి గురి చేసింది. మరి అంత పెద్ద స్టార్ హీరో కూతురు... ధనిక కుటుంబానికి చెందిన సోనమ్ ను చిన్నప్పుడే అంతగా ఎవరు బాధ పెట్టుంటారు.... అని బాలీవుడ్ వర్గాల్లో ఒకటే చర్చ జరుగుతుంది. అసలు ఒక బడా హీరో కూతురు అందులోను స్టార్ హీరోయిన్ అయిన సోనమ్ ఈ విషయాల్ని ఓపెన్ గా చెప్పి అందరిని విస్మయానికి గురి చేసింది. మరి ఇది నిజమేనా లేక..తోటి హీరోయిన్లు హాలీవుడ్ వెళ్లిపోతున్నారని క్రేజ్ కోసం చెప్పిందా..అనేది తెలియాల్సి వుంది. 

sonam kapoor
sonam kapoor hot comments
sonam kapoor sensational comments