కొత్త దర్శకుడు డైరెక్షన్ లో చైతు..!

చాలా కాలం తర్వాత మలయాళ రీమేక్‌ 'ప్రేమమ్‌'తో సోలో హీరోగా నాగచైతన్య మంచి హిట్‌ కొట్టాడు. తర్వాత వచ్చిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంతో ఫర్వాలేదనిపించున్నాడు. తాజాగా ఆయన రకుల్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.తన తండ్రి నాగార్జునకు 'సోగ్గాడే చిన్నినాయానా' వంటి సెన్సేషనల్‌ హిట్‌ను ఇచ్చిన కొత్త దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఆయన ఈ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత నాగచైతన్య వారాహి చలనచిత్రం బేనర్‌లో సాయికొర్రపాటి నిర్మాతగా వైవిధ్యదర్శకుడు, తాజాగా నానితో 'జెంటిల్‌మన్‌' చిత్రం తీసి మరలా ఫామ్‌లోకి వచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటన కూడా వచ్చింది. కానీ ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం నుండి ఇంద్రగంటి మోహనకృష్ణను బయటకు పంపారని సమాచారం. ఆ స్దానంలో మరో క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్‌. తన ప్రతి చిత్రాన్ని ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దే చంద్రశేఖర్‌ యేలేటికి ఇది మంచి అవకాశమే అని చెప్పవచ్చు. కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా విభిన్న చిత్రాలను ఇష్టపడే ఓ వర్గం ఆడియన్స్‌ను, విమర్శకులను మెప్పిస్తూ వస్తున్న చంద్రశేఖర్‌ యేలేటి తాజాగా వారాహి చలనచిత్రం బేనర్‌లోనే మోహన్‌లాల్‌, గౌతమి తదితరులతో తీసిన 'మనమంతా' చిత్రం కూడా ఎన్నో ప్రశంసలు అందుకుంది. కానీ ఈ చిత్రం కూడా కమర్షియల్‌గా పెద్దహిట్టేమీ కాలేదు. మరి చైతూతో చిత్రంతోనైనా ఆయన ఓ మంచి కమర్షియల్‌ హిట్‌ను కొడతాడో? లేదో? వేచిచూడాల్సివుంది.

akkineni naga chaitanya
premam movie
new director kalyan krishna
producer sai korrapati
indrakanti mohan krishna
chandra sekhar yeleti new director with naga chaitanya