Advertisement

సూర్య పై చరణ్ నెగ్గుతాడా..?

Thu 01st Dec 2016 02:48 PM
ram charan,surya,dhruva movie,s3 (singam3) movie,rakul preet singh,anushka,shruthi haasan  సూర్య పై చరణ్ నెగ్గుతాడా..?
సూర్య పై చరణ్ నెగ్గుతాడా..?
Advertisement

రామ్‌చరణ్‌కు మెగాభిమానుల అండదండలతో పాటు మాస్‌ చిత్రాల ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్‌ ఉన్న మాట వాస్తవమే. కానీ ప్రస్తుతం టాలీవుడ్‌ ఆడియన్స్‌ టేస్ట్‌లో కూడా చాలా మార్పు వచ్చింది. ఎంత పెద్ద స్టార్‌ చిత్రమైనా బాగా లేకపోతే నిర్ద్వంధంగా తిరస్కరిస్తూ, డిజాస్టర్స్‌గా మిగులుస్తున్నారు. దానికి తాజాగా ఈ ఏడాది విడుదలైన 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌, బ్రహ్మూెత్సం' చిత్రాలను ఉదాహరణగా చెప్పవచ్చు. అదే సమయంలో ఏ భాషా చిత్రమైనా, హీరోలు, దర్శకుల ఇమేజ్‌తో సంబంధం లేకుండా సినిమాలో దమ్ముంటే పట్టం కడుతున్నారు. దానికి 'బిచ్చగాడు' సాధించిన విజయమే ఉదాహరణ.

కాగా ప్రస్తుతం రామ్‌చరణ్‌ తమిళ సూపర్‌హిట్‌ మూవీ 'తని ఒరువన్‌'కు రీమేక్‌గా 'ధృవ' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్‌ 9న విడుదల కానుంది. ఇక తమిళస్టార్‌ సూర్యకు తెలుగులో కూడా మంచి గుర్తింపే ఉంది. అటు ప్రయోగాత్మక చిత్రాలు, వైవిధ్యభరితమైన చిత్రాలతో క్లాస్‌ ప్రేక్షకుల్లోనే గాక, 'గజిని'తో పాటు 'సింగం' సిరీస్‌తో ఆయన తెలుగులో మాస్‌ ప్రేక్షకుల ఆదరణను కూడా బాగా చూరగొన్నాడు. ఆయన నటించిన '24' వంటి కొన్ని చిత్రాలు తమిళంలో కంటే తెలుగులోనే బాగా ఆడాయి. ఇక డిసెంబర్‌ 16న ఆయన నటించిన 'ఎస్‌3' చిత్రం తమిళ, తెలుగు భాషల్లో భారీగా విడుదల కానుంది. మాస్‌ అండ్‌ యాక్షన్‌ చిత్రాల స్పెషలిస్ట్‌గా, మరీ ముఖ్యంగా సూర్యను పవర్‌ఫుల్‌ పోలీసు పాత్రలతో మాస్‌ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేసిన హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా 'దృవ' చిత్రాన్ని మొదట డిసెంబర్‌ 2న విడుదల చేయాలనుకున్నారు. అదే జరిగి ఉంటే చరణ్‌ చిత్రానికి, సూర్య చిత్రానికి మద్య రెండు వారాల గ్యాప్‌ అయినా ఉండేది. అది చరణ్‌కు ప్లస్‌ అయివుండేది. కానీ ఈ చిత్రం డిసెంబర్‌ 9న విడుదల కానుండటంతో 'ధృవ'కు 'ఎస్‌3'కు మద్య కేవలం వారం మాత్రమే గ్యాప్‌ ఉంది. ఈ రెండు చిత్రాలు పోలీస్‌ స్టోరీలుగానే తెరకెక్కుతుండటంతో పోలీస్‌ పాత్ర పోషించడంలో చరణ్‌కు సూర్యకు మద్య ఖచ్చితంగా పోలికలు వస్తాయి. ఆల్‌రెడీ 'జంజీర్‌' (తుపాన్‌) చిత్రంలో పోలీస్‌గా మెప్పించడంలో చరణ్‌ దారుణంగా విఫలం కావడం, సూర్య మాత్రం తాను నటించిన పోలీస్‌ చిత్రాలన్నింటిలో తన నటన ద్వారా అందరి హృదయాలను దోచుకోవడం జరిగిందనేది వాస్తవం. దీంతో ఈ రెండు చిత్రాలలోని ఇద్దరు హీరోల నటనను పోల్చిచూడటం ఖాయం. 'ధృవ' చిత్రం విషయానికి వస్తే ఇది పూర్తి మాస్‌ చిత్రం కాదు. వైవిధ్యభరితమైన చిత్రం. ఇలాంటి స్టోరీని చరణ్‌కు బాగా అభిమానులైన మాస్‌ ప్రేక్షకులు, బి,సి సెంటర్ల ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనే సందేహాలున్నాయి. ఇక 'ఎస్‌3' విషయానికి వస్తే ఇది పక్కా మాస్‌ చిత్రంగా రూపొందుతోంది. దీంతో చరణ్‌ కంటే సూర్యనే మాస్‌ ప్రేక్షకులను ఎక్కువగా అలరించే అవకాశాలున్నాయి. ఇక 'ఎస్‌3'లో తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉన్న టాప్‌హీరోయిన్లు అనుష్క, శృతిహాసన్‌ కలిసి నటిస్తుండటం కూడా దీనికి కలిసొచ్చే అంశమని చెప్పాలి. అయితే 'ధృవ' చిత్రం రీమేక్‌ కనుక మినిమం గ్యారంటీ ఖాయమని అందరూ భావిస్తున్నారు. మరి ఈ యుద్దంలో చరణ్‌ ఏ విధంగా నెగ్గుకొస్తాడు? అనే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement