Advertisementt

తెర జంట నిజ జంటయ్యారు..!

Fri 25th Nov 2016 07:15 PM
dileep,kavya,kannada actor dileep,dileep weds kavya,second marriage  తెర జంట నిజ జంటయ్యారు..!
తెర జంట నిజ జంటయ్యారు..!
Advertisement
Ads by CJ

సినిమాలు వేరు, వ్యక్తిగత జీవితం వేరు అంటూ ఆర్టిస్టులు చెబుతుంటారు. సినిమాల ద్వారా సందేశాలు ఇచ్చినా, నిజ జీవితం వచ్చే సరికి వారు చేసే పనులు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా మలయాళ సినీరంగంలో ఇదే జరిగింది. హీరో దిలీప్‌ (48), నటి కావ్యా (30) ఓ ఇంటివారయ్యారు. కొద్ది రోజులుగా ప్రేమాయణం నడుపుతున్న వీరిరువురు ఇప్పుడు ఒక్కటయ్యారు. చిత్రమేమంటే ఇద్దరికీ ఇది రెండో పెళ్ళికావడం. ఇద్దరు కూడా మొదటి బంధాన్ని తెంపేసుకున్నారు. విడాకులు తీసుకున్నారు. దిలీప్‌కు ఒక కుమార్తె కూడా ఉంది. 

మోహన్‌లాల్‌, సురేష్‌గోపి, మమ్ముట్టి తర్వాత దిలీప్‌కు మలయాళంలో మంచి క్రేజ్‌ ఉంది. నటుడు, నిర్మాత, దర్శకుడు కూడా. పాతికేళ్ళ సినీ కెరీర్‌ పూర్తిచేశాడు. సుమారు 130 సినిమాల్లో నటించాడు. కావ్యా చైల్డ్‌ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసి పాతికేళ్ళ కెరీర్‌ పూర్తిచేసింది. ఇద్దరు కలిసి సుమారు 20 చిత్రాల్లో నటించారు. 

అతి కొద్దిమంది ఆహ్వానితుల నడుమ వీరి వివాహం జరిగింది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ