సాహస వీరుడు!!

'సాహసం' అని టైటిల్‌ ఉన్నందుకేమో చిత్ర యూనిట్‌ నిజంగానే సాహసం చేసింది. మార్కెట్‌లో ఆర్థిక ప్రతికూలత ఉన్నప్పటికీ వెనకడుగు వేయక 'సాగిపో'తోంది. నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ కలయికలో వస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం అనుకున్న విధంగానే శుక్రవారం నుండి ప్రేక్షకులను అలరించనుంది. 

సరిగ్గా బుధవారం నాడు 'పెద్ద' నోట్ల రద్దుతో ప్రజలు బెంబేలెత్తారు. వంద నోట్లకు డిమాండ్‌ పెరగడంతో, వాటిని అపురూపంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో వంద ఖర్చు పెట్టి సినిమా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా లేరు. దీనివల్ల సినిమా కలక్షన్లపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితి మెరుగుపడాలంటే కొద్ది రోజులు పడుతుంది. ఇది తెలిసే శుక్రవారం విడుదలకావాల్సిన 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' రిలీజ్‌ వాయిదా వేశారు. కానీ 'సాహసం శ్వాసగా సాగిపో' మాత్రం అన్నిటికి తెగించే రిలీజ్‌ అవుతోంది. 'నోట్ల' వ్యవహారం రెండు, మూడు రోజులే ఉంటుందని నమ్మడమే దీనికి కారణం. దాంతో సోలో సినిమాగా నాగచైతన్య వచ్చేశాడు.

sahasam swasaga sagipo movie
sahasam swasaga sagipo release
solo release
naga chitanya