అఖిల్ మరో తప్పు చేస్తున్నాడా..?

Tue 25th Oct 2016 06:25 PM
akhil akkineni,boyapati sreenu,vikram kumar k,nagarjuna,akhil 3rd movie  అఖిల్ మరో తప్పు చేస్తున్నాడా..?
అఖిల్ మరో తప్పు చేస్తున్నాడా..?
Sponsored links

అఖిల్ హీరోగా చేసిన 'అఖిల్' సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు కావొస్తుంది. అయితే అఖిల్ రెండో సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదు. 'అఖిల్' సినిమా ఇచ్చిన షాక్ నుండి తేరుకోవడానికి అక్కినేని ఫ్యామిలీకి చాలా రోజులే పట్టింది. ఇక నాగార్జున ఆ మధ్యన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో అఖిల్ తన రెండవ చిత్రాన్ని చేస్తున్నాడని ప్రకటించినప్పటికీ అది ఇంతవరకు పట్టాలెక్కలేదు. దీనికి కారణం విక్రమ్ కి పెళ్లి అవ్వడం వల్ల వచ్చిన గ్యాప్ అని తెలుస్తున్నా...మరీ లేట్ అయితే విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఈ మూవీ ఉంటుందా లేక మళ్ళీ దర్శకుడు మారతాడా... అనే అనుమానాలు తలెత్తడం ఖాయం. ఇప్పటికే అఖిల్ రెండో సినిమాకి అనేకమంది దర్శకుల పేర్లు బయటికి వచ్చాయి. ఆఫీషియల్ గా మాత్రం నాగార్జున.. విక్రమ్ పేరు చెప్పాడు. ఇక రెండో సినిమా గురించే ఇలా ఉంటే... ఇప్పుడు అఖిల్ మూడో సినిమా గురించి ప్రచారం మొదలైంది.

అఖిల్ తన 3  వ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఇది నిజమో లేక రూమరో గాని అఖిల్.. బోయపాటితో సినిమా చెయ్యడం కరెక్ట్ కాదనే కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే అఖిల్ తన మొదటి సినిమా మాస్ లుక్ లో కనిపించి అంతగా మెప్పించలేకపోయాడు. మరి బోయపాటి శ్రీను ఖచ్చితం గా అఖిల్ ని మాస్ లూక్లోనే చూపిస్తాడు గాని కొత్తగా ఏమి చెయ్యడు కాబట్టి అఖిల్ ఆలోచించుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలామంది. అఖిల్ ఏదైనా ఫ్యామిలీ చిత్రం గానీ, లవ్ కి సంబందించిన సినిమా గాని చేసి తనని తానూ ప్రూవ్ చేసుకున్నాక మాస్ చిత్రాల జోలికి వెళ్లడం మంచిదని చెబుతున్నారు. నాగ చైతన్య కూడా ఈ మధ్యే ఈ విషయం తెలుసుకుని మాస్ ని వదిలి ప్రేమ పై చిత్రాలు చేస్తున్నాడు. మరి ఈ కామెంట్స్ విన్న నాగార్జున అఖిల్ కి మంచి సలహా ఇస్తాడేమో చూద్దాం.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019