Advertisementt

'అల్లరి' మలయాళ మంత్రం..!

Tue 30th Aug 2016 08:25 PM
allari naresh,chiranjeevi,sunil,oru vadakkan selfie,allari naresh in malayalam movie remake  'అల్లరి' మలయాళ మంత్రం..!
'అల్లరి' మలయాళ మంత్రం..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ హీరోలు సక్సెస్‌ కోసం రీమేక్‌ మంత్రం జపిస్తున్నారు. చిరంజీవి మొదలు సునీల్‌ వరకు రీమేక్‌లను నమ్ముకున్న నేపథ్యంలో తానేమి తక్కువ కాదని 'అల్లరి' నరేష్‌ సైతం 'జై..' కొడుతున్నాడు. చాలా సంవత్సరాలుగా గెలుపు ముఖం చూడని ఈ కామెడీ హీరోకు మరో కామెడీ హీరో సునీల్‌ గట్టి పోటీనిస్తున్నాడు. అయితే సునీల్‌కు చేతినిండా సినిమాలుంటే నరేష్‌ను మాత్రం పలకరించేవారే కరువయ్యారు. ఎందుకంటే నరేష్‌కు మినిమం గ్యారంటీ అనేది లేకపోవడం. దాంతో హిట్‌ కోసం ముఖం వాచిన ఈ 'అల్లరి' బాబు తాజాగా మలయాళంలో హిట్‌ అయిన 'ఒరు వడక్కన్‌ సెల్ఫీ' అనే సినిమాపై ముచ్చటపడ్డారు. రీమేక్‌లో నటించడానికి 'సై' అన్నాడు. అక్టోబర్‌లోనే షూటింగ్‌ ప్రారంభిస్తారట. అన్నట్టు ఈ సినిమాకు 'అలా ఎలా' అనే ఒక మంచి సినిమా తీసిన అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తారు. మలయాళ మంత్రంతో నరేష్‌ గట్టెక్కుతాడా అనేది వేచి చూడాలి.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ