Advertisement

అక్కడ చిరు రికార్డుకి.. మహేష్ బ్రేక్..!

Thu 28th Jul 2016 04:28 PM
chiranjeevi,mahesh babu,east godavari district,anusree,vintage  అక్కడ చిరు రికార్డుకి.. మహేష్ బ్రేక్..!
అక్కడ చిరు రికార్డుకి.. మహేష్ బ్రేక్..!
Advertisement

చిరంజీవి 150 వ సినిమా మొదలైందో లేదో అప్పుడే ఎన్నో సంచలనాలకు తెరతీసింది. అన్నిపాత రికార్డ్స్ ని తుడిచేసి కొత్త రికార్డ్స్ ని నెలకొల్పుతుంది. ఈ సినిమా ఏరియా వైజ్ గా బిజినెస్ జరిగిపోయింది. ఈ సినిమా తూర్పుగోదావరి రైట్స్ ని అనుశ్రీ అనే డిస్ట్రిబ్యూటర్ సంస్థ రికార్డు స్థాయిలో 5.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏరియాలో 'సర్దార్ గబ్బర్ సింగ్' పేరిట వున్న 5.4 కోట్ల రికార్డును చిరు 150 వ సినిమా బద్దలుకొట్టింది. 5.5 కోట్లకు అమ్ముడు పోయి చిరంజీవి 150 వ సినిమా చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉండగా చిరంజీవి 150 సినిమా రికార్డ్స్ ని మరో హీరో తుడిచెయ్యడానికి రెడీ అయ్యాడు. ఆ హీరో ఎవరో కాదు మహేష్. మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇంకా స్టార్ట్ అవ్వకముందే రికార్డు స్థాయిలో బిజినెస్ మొదలైందని సమాచారం. ఈ సినిమా ఈస్ట్ గోదావరి రైట్స్ కోసం వింటేజ్ ఫిల్మ్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ 5.75 కోట్ల నుండి 6 కోట్ల వరకు ఆఫర్ చేసిందని సమాచారం. ఇదే గనక నిజమైతే చిరు 150 వ సినిమా మీద నెలకొల్ప పడ్డ ఆల్ టైం రికార్డుని మహేష్ సినిమా బద్దలుకొట్టేలా ఉందని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement