Advertisementt

కాంగ్రెస్‌.. తహతహలాడేది దేని కోసం?

Sun 17th Jul 2016 09:50 PM
congress,mim,trs,azhar,shabbir ali,tpcc chief  కాంగ్రెస్‌.. తహతహలాడేది దేని కోసం?
కాంగ్రెస్‌.. తహతహలాడేది దేని కోసం?
Advertisement
Ads by CJ

రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారితో చెలిమి చేస్తూ, తమ వైపు ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును చూపించి తమ పవర్‌ను చూపి, పనులు చేయించుకోవడంలో మజ్లిస్‌ పార్టీ ముందుంటుంది. బిజెపిని మతతత్వ పార్టీగా విమర్శించే కుహనా లౌకిక వాదులు ఎంఐఎం విషయంలో మాత్రం మౌనం పాటిస్తారు. దీంతో తమ పార్టీని ముస్లింలు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేయడానికి ఎంఐఎం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే కొంతమేర విజయం సాధించిన మజ్లిస్‌ పార్టీ రోజురోజుకు బలపడటం చాలా ఆందోళన కలిగించే అంశం. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి మిత్రపక్షంగా వ్యవహించిన ఎంఐఎం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ను కూడా తమకు గులాం చేసే విషయంలో విజయం సాధించింది. కానీ మరోవైపు తెలంగాణలో 2019 నాటికైనా విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఎంఐఎంతో పొత్తు కోసం ఇప్పటినుంచే తీవ్ర కసరత్తు చేస్తోంది. త్వరలో టిపిసిసి ఛీఫ్‌గా అజారుద్దీన్‌ లేదా షబ్బీర్‌అలీలను నియమించాలని పార్టీలోని ముస్లిం వర్గం కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి తెస్తోంది. అజారుద్దీన్‌ లేదా షబ్బీర్‌ అలీలను టిపిసిసి ఛీప్‌ను చేసి మజ్లిస్‌ మోచేతి నీళ్లు తాగాలని కాంగ్రెస్‌ పడుతున్న ఆరాటం చూసి ప్రజలు విస్తుపోతున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ