Advertisementt

'కబాలి' రిలీజ్ తో మహేష్, నితిన్ హ్యాపీ?

Wed 11th May 2016 10:48 PM
kabali,kabali release date postponed,brahmotsavam,a aa movie,rajinikanth  'కబాలి' రిలీజ్ తో మహేష్, నితిన్ హ్యాపీ?
'కబాలి' రిలీజ్ తో మహేష్, నితిన్ హ్యాపీ?
Advertisement

సౌత్‌ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం వచ్చి ఒకటిన్నర ఏడాది అవుతోంది. కానీ ఆయన నటించిన 'లింగా' చిత్రం అందరినీ తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో రజనీ రంజిత్‌పా అనే కుర్ర దర్శకునికి అవకాశం ఇచ్చి వేగంగా 'కబాలి' చిత్రం షూటింగ్‌ను ముగించాడు. వాస్తవానికి ఈ చిత్రం తమిళ సంవత్సరాది ఏప్రిల్‌14న విడుదలవుతుందని ముందు యూనిట్‌ ప్రకటించింది. కానీ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని రజనీ నిర్మాత కలైపులి థానును రిక్వెస్ట్‌ చేశాడు. దాంతో ఈచిత్రం జూన్‌3న విడుదల చేయనున్నామని నిర్మాత అఫీషియల్‌గానే అనౌన్స్‌ చేశాడు. తాజా సమాచారం ప్రకారం 'కబాలి' జూన్‌ 3న కూడా విడుదల కావడం లేదు. ఎన్నికలు, వాటి ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాట్లు వంటి హడావుడి ఉన్నందున జులై మొదటివారానికి 'కబాలి'ని పోస్ట్‌ పోన్‌ చేశారట. అంతేకాదు.. ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాలేదనే సాకు చెబుతున్నారు. సో.. రజనీ ఏకంగా జులై మొదటి వారానికి వెళ్లిపోతే అది మహేష్‌బాబు 'బ్రహ్మోత్సవం', త్రివిక్రమ్‌-నితిన్‌ల 'అ..ఆ'లకు కలిసి రానుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement