Advertisementt

లిస్ట్ లోకి..అలియాభట్‌ పేరు చేరింది!

Mon 09th May 2016 08:56 PM
alia bhatt,mahesh babu,muragadoss,alia bhatt in mahesh babu movie  లిస్ట్ లోకి..అలియాభట్‌ పేరు చేరింది!
లిస్ట్ లోకి..అలియాభట్‌ పేరు చేరింది!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా తమిళ సంచలన దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్వీప్రసాద్‌, ఠాగూర్‌ మధులు సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ ప్రాజెక్ట్‌కు బాలీవుడ్‌లో కూడా క్రేజ్‌ తెచ్చేందుకు యూనిట్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ చిత్రంలో మహేష్‌ సరసన నటించే హీరోయిన్‌ కోసం ప్రస్తుతం అన్వేషణ జరుగుతోంది. మొదటగా శృతిహాసన్‌ పేరు వినిపించింది. ఆ తర్వాత పరిణితి చోప్రా, దీపికాపడుకొనే వంటి బాలీవుడ్‌ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా అలియాభట్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. మరి ఈ వార్త లో ఎంత నిజం వుందనేది తెలియాల్సి వుంది. ఒకవేళ నిజమైతే.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్‌ ఉందని చెబుతున్నారు కాబట్టి  అలియాను మెయిన్‌ హీరోయిన్‌గా తీసుకున్నారా? లేక సెకండ్‌ హీరోయన్‌ పాత్రకు ఎంపిక చేశారా? అనే దానిపై కూడా స్పష్టత రావాలి. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ