పవన్ కు హీరోయిన్ దొరికిందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్యల కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకొంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట అమలాపాల్ ను అనుకున్నట్లు తెలుస్తోంది. కాని అమలాపాల్ తమిళంలో వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వలన మరో హీరోయిన్ వేటలో పడ్డారు. మలయాళంలో 'బెంగుళూరు డేస్' సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్ పార్వతిని పవన్ సరసన సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఆఫర్ కు పార్వతి సైతం ఓకే చెప్పడంతో పవన్ కు హీరోయిన్ దొరికేసిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పవర్ సర్ పవన్ కళ్యాణ్ తో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం ఈ అమ్మడు అదృష్టమనే చెప్పాలి. ఫ్యాక్షన్ లీడర్ ప్రేమ కథగా వస్తోన్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 

pawan kalyan
surya
amalapaul
parvathi